Bimbisara Movie Child Artist : నందమూరి కల్యాణ్ తొలి సారిగా చేసిన భారీ బడ్జెట్ మూవీ.. బింబిసార. ఈ మూవీని స్వయంగా ఆయనే తన ఎన్‌టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. క్రీస్తు పూర్వం త్రిగర్తల రాజ్యాన్ని పాలించిన బింబిసారుడి కథను ఆధారంగా చేసుకుని కల్పిత పాత్రలతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీతో వశిష్ట అనే దర్శకుడు కొత్తగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
అయితే బింబిసార మూవీలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది. ఆమె పేరు శ్రీదేవి. కల్యాణ్ రామ్ ఉండే రెండు ఎపిసోడ్స్ (ఫ్లాష్ బ్యాక్, ప్రస్తుతం) లలోనూ ఈ చిన్నారి యాక్ట్ చేసింది. అయితే ఈమెకు ఇదే తొలి మూవీ కాదు. ఇంతకు ముందు పలు మూవీల్లోనూ నటించింది. రామారావు ఆన్ డ్యూటీ, మేజర్ వంటి సినిమాలతోపాటు పలు సీరియల్స్‌లోనూ ఈమె యాక్ట్ చేస్తోంది. ఇక ఈమె తండ్రి శ్రీహరి గౌడ్ ఆర్టిస్టు మాత్రమే కాక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా.
చిన్నారి శ్రీదేవి ఇప్పటి వరకు 15 సీరియల్స్, 10 యాడ్స్‌లో నటించింది. బింబిసారతోపాటు పలు మూవీల్లోనూ యాక్ట్ చేసింది. అయితే బింబిసార మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఈమె శాంభవిగా అదరగొట్టేసింది. ఈమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే సినిమాలో ఈమె నటనకు అందరూ ఈమెను ప్రశంసిస్తున్నారు. ముద్దు ముద్దుగా క్యూట్‌గా ఉండే ఈ చిన్నారి తన హావభావాలతోనూ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…