Samantha : స‌మంత‌కు అలాంటి కోరిక ఉండేద‌ట‌.. నాగ‌చైత‌న్య‌తో తీర్చుకోలేక‌పోయిందిగా..!

Samantha : ఏ మాయ చేశావే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన స‌మంత‌.. ఒక్క సినిమాతోనే పాపుల‌ర్ అయింది. యువ‌త‌ను తన వైపు తిప్పుకుంది. ఈ సినిమాలో సమంత యాక్టింగ్‌కు ప్రేక్ష‌కులు ముగ్ధుల‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఏకంగా అన‌తికాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది. ఇక ఆ తరువాత ఈ అమ్మడు వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఈమె సినీ లైఫ్ అద్భుతంగా మారిపోయింది. ఎంత‌లా అంటే.. ప్ర‌తి హీరో స‌మంత‌తో సినిమా చేసేందుకు ఆస‌క్తి చూపించాడు. అలా డైరెక్టర్లు, నిర్మాతల పాలిట ఈమె అదృష్ట దేవతగా మారింది. ఇక‌ సమంత తక్కువ టైంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌కు చేరుకుంది. దక్షిణాదిలో ఈమె దాదాపుగా స్టార్ హీరోలందరితోనూ నటించింది. అంతే కాకుండా తన నటన, హావభావాలతో లక్షలాది మంది ఫాలోవ‌ర్ల‌ను సొంతం చేసుకుంది. ఈమె దూకుడు మామూలుగా లేదు.

అయితే కెరీర్ పీక్ టైమ్‌లో ఉండగానే నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. త‌రువాత‌ అక్కినేని కోడలిగా మారింది. అయితే ప్రేమించినంత కాలమైనా పెళ్లి బంధాన్ని నిలుపుకోలేదు. నాలుగేళ్లకే వీరి మధ్య గొడవలు రాగా అవి విడాకుల వ‌ర‌కు దారి తీశాయి. ఈ క్ర‌మంలోనే స‌మంత బాధ పడుతూ కూర్చోకుండా.. విడాకుల తరువాత కూడా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక‌ సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ఖాళీ స‌మ‌యంలో తనకు నచ్చిన ప్ర‌దేశాలకి వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్క‌డి ఫోటోల‌ను కూడా షేర్ చేస్తోంది. అయితే ఈమ‌ధ్య కాలంలో స‌మంత సోష‌ల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండ‌డం లేదు.

Samantha

ఇక సమంత గ‌తంలో ఓ విష‌యాన్ని తెలియ‌జేసింది. త‌న‌కు చిన్నప్పటి నుండి స్వీట్స్ కన్నా ఐస్ క్రీమ్ అంటేనే చాలా ఇష్టమని చెప్పింది. గడ్డకట్టే చ‌లిలో తనకు ఇష్టమైన వ్యక్తితో కలిసి.. ఐస్ క్రీమ్ ను షేర్ చేసుకుని తినాల‌నే కోరిక ఉండేద‌ని చెప్పింది. అయితే పెళ్ల‌యాక స్విట్జ‌ర్లాండ్‌కు వెళ్లి చైతూతో ఇలాగే చేద్దామ‌ని ప్లాన్ వేసింద‌ట‌. కానీ వీలు కాలేదు. అయితే ఆ త‌రువాత మ‌ళ్లీ వీరు అక్క‌డికి వెళ్ల‌లేదు. త‌రువాత వీరు విడాకులు తీసుకున్నారు. దీంతో స‌మంత కోరిక నెర‌వేర‌కుండానే పోయింది. అయితే సింగిల్‌గానైనా స‌రే స్విట్జర్లాండ్‌కు వెళ్లి త‌న కోరిక‌ను నెర‌వేర్చుకుంటుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM