Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత వ్యవహార శైలిలో కాస్త మార్పు వచ్చిందనే చెప్పాలి. జోరుగా సినిమాలు చేస్తూనే ఐటమ్ సాంగ్స్ కూడా చేయగలనని చాటి చెప్పింది. అలాగే సిరీస్‌లలోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. ఇక ఈ ఏడాది సమంత జోరు మామూలుగా ఉండదనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు ఈ ఏడాదిలో వరుసగా రిలీజ్ కానున్నాయి. అయితే సమంతకు నటిగా మంచి గుర్తింపు ఉన్నా.. ఆమె గ్లామర్ షో చేయడం మాత్రం ఆపడం లేదు. ప్రస్తుత తరుణంలో కాంపిటీషన్ వస్తున్న హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా సమంత అందాలను ఆరబోస్తోంది.
తాజాగా సమంత ఓ మ్యాగజైన్‌కు కవర్ ఫొటోషూట్ చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే ఎద అందాలను ఆరబోస్తూ ఆమె దుస్తులు ధరించింది. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక వాటి తాలూకు వీడియో ప్రస్తుతం రిలీజ్ అయింది. దీంతో ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇక ఫొటోల్లో కన్నా వీడియోలోనే సమంత ఎక్కువ గ్లామర్‌గా కనిపిస్తుండడం విశేషం. దీంతో సమంత జోరు చూసి అందరూ షాకవుతున్నారు. ఆమె రోజు రోజుకీ ఇంతలా రెచ్చిపోతుందేమిటి ? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆమె వీడియోను కూడా చాలా మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం పలు షూటింగ్‌లలో పాల్గొంటోంది. ఆమె నటించిన కాతు వాకుల రెండు కాదల్ అనే తమిళ మూవీ ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. అలాగే మరో సినిమా యశోద ఆగస్టులో రిలీజ్ అవనుంది. దీంతోపాటు శాకుంతలం అనే పౌరాణిక చిత్రంలోనూ సమంత నటించగా.. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దీని విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఏది ఏమైనా సమంత ఇటీవలి కాలంలో స్కిన్ షోను ఎక్కువ చేసిందనే చెప్పవచ్చు.
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…