Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం సమంత తన కెరీర్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే వరుస సినిమాలకు సంతకాలు చేస్తోంది. ఇక పుష్ప కోసం ప్రత్యేక సాంగ్‌లోనూ కనిపించనుంది. అందుకుగాను ఈమె భారీ మొత్తంలో తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలో సమంత ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. కొటేషన్స్ షేర్ చేయడంతోపాటు తనకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తోంది. అయితే విడాకుల ప్రకటన చేసిన తరువాత ఇన్ని రోజులకు సమంత మరోమారు అక్కినేని కాంపౌండ్‌లో అడుగు పెట్టింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోకు సమంత వచ్చినట్లుగా తెలుస్తోంది. నాగచైతన్యతో విడాకులను ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోకు ఆమె మొదటిసారిగా వచ్చింది. ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో ఆమె నటించింది. కాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
కాగా ఈ మూవీ డబ్బింగ్ వర్క్ పూర్తి చేసేందుకు సమంత అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుండగా.. ఆమె వాటిని పరిశీలించేందుకు వెళ్లినట్లు సమాచారం. ఆమె తన సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోదు. సింగర్ చిన్మయి చెబుతుంది. అయినప్పటికీ కొన్ని సార్లు స్టార్స్ తమ డబ్బింగ్ పనుల్లో పాల్గొంటారు. సమంత కూడా అందుకనే వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇక నాగచైతన్య పుట్టినరోజున అతనికి బర్త్ డే విషెస్ చెప్పలేదు. కానీ తన కుక్క బర్త్ డేకు ఏకంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో సమంతపై అక్కినేని ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…