Samantha : ప్చ్‌.. స‌మంత ప‌డ్డ క‌ష్టం అంతా వృథాయేనా..?

Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ అమ్మ‌డు సినిమాలు, ప‌ర్స‌న‌ల్ విష‌యాలు, సోష‌ల్ మీడియా పోస్ట్‌ల‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. స‌మంత కొద్ది రోజుల క్రితం శాకుంత‌లం అనే చిత్ర షూటింగ్ పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. మ‌హాభార‌తంలోని ఆదిప‌ర్వం స్పూర్తిగా.. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగా తెర‌కెక్కుతోంది. మైథ‌లాజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ సినిమాలో సామ్ శ‌కుంత‌లగా క‌నిపించ‌నుండ‌గా.. మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ దుష్యంత‌ రాజుగా న‌టిస్తున్నాడు. క‌బీర్ సింగ్ దుహ‌న్ రాజు అసుర పాత్ర పోషిస్తున్నాడు.

Samantha

గుణ‌శేఖ‌ర్ డ్రీమ్ ప్రాజెక్టుగా వ‌స్తున్న ఈ సినిమా కోసం సామ్ ప్ర‌త్యేకించి బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ తీసుకుంది. శ‌కుంత‌ల పాత్ర కోసం మూడు నెల‌లు శిక్ష‌ణ తీసుకున్న‌ట్టు చెప్పింది సామ్‌. పురాణాల కాలం నాటి సాధారణ భంగిమలు, మనోహరమైన నడక, పౌరాణిక పాత్రలతో అనుసంధానంగా ఉండే సంజ్ఞలు, ఇత‌ర అంశాల‌పై సామ్ శిక్ష‌ణ తీసుకుంద‌ట‌. అయితే ఈ సినిమా కోసం చాలా మంది అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, కొన్నాళ్లుగా ఒక్క అప్‌డేట్ లేదు. క‌నీసం స‌మంత ఈ సినిమా చేసింద‌ని కొంత మందికి తెలియ‌దు కూడా.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తుంటే సినిమా కోసం ఆమె ప‌డిన క‌ష్టం, త్యాగం అన్ని వృథా అయిన‌ట్టేన‌ని అభిమానులు చాలా బాధ‌ప‌డుతున్నారు. స‌మంత ఈ సినిమా కోసం ప‌డిన‌ క‌ష్టం అంతా వేస్ట్ అయిన‌ట్టేనా అని కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. శాకుంత‌లం సినిమా స్పూర్తితో స‌మంత రానున్న రోజుల‌లో మ‌రిన్ని లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌లు చేయాల‌ని అనుకుంద‌ని, కానీ ఈ సినిమా నీరు గార్చింద‌ని కామెంట్స్ చేస్తున్నారు. శాకుంత‌లం సినిమాని 2022 చివ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. యువ‌రాజు భ‌ర‌త పాత్ర‌లో అల్లు అర్జున్ కూతురు అర్హ క‌నిపించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇండియా పోస్ట్‌లో 28,740 ఉద్యోగాలు.. జనవరి 31 నుంచే అప్లికేషన్లు షురూ!

భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…

Wednesday, 28 January 2026, 3:07 PM

‘దేవర 2’ షూటింగ్ ఎప్పుడు? అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇక పండగే!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…

Wednesday, 28 January 2026, 12:12 PM

వివో నుంచి మరో పవర్ ఫుల్ ఫోన్.. భారత్‌లో Vivo X200T లాంచ్.. ఫీచర్లు, ధర చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…

Tuesday, 27 January 2026, 9:25 PM

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే మొబైల్ నంబర్ అప్‌డేట్..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…

Tuesday, 27 January 2026, 7:39 PM

మెగాస్టార్ చిరంజీవికి చిన్మయి బిగ్ కౌంటర్.. ‘కమిట్‌మెంట్’ అంటే అది కాదు, అబద్ధం చెప్పకండి అంటూ ఫైర్!

70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…

Tuesday, 27 January 2026, 5:49 PM

పది పాసైతే చాలు.. ఆర్‌బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి లింక్ ఇదే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…

Tuesday, 27 January 2026, 2:59 PM

లోకేష్ కనగరాజ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ‘మీకు కలెక్షన్లే కావాలా.. కథ అక్కర్లేదా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…

Tuesday, 27 January 2026, 9:45 AM

మీ ఫోన్ స్లోగా చార్జ్ అవుతుందా? ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో ఫుల్ చార్జింగ్!

నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…

Monday, 26 January 2026, 9:44 PM