Sai Pallavi : చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన సాయిప‌ల్ల‌వి.. అస‌లు కార‌ణం చెప్పేసింది..!

June 14, 2022 10:01 AM

Sai Pallavi : టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు స‌త్తా చాటుతున్నా.. సాయిప‌ల్ల‌వి ప్ర‌త్యేక‌త‌నే వేరు అని చెప్ప‌వ‌చ్చు. ఈమె మొద‌టి నుంచి అనేక అంశాల్లో క‌ఠినంగా ఉంటూ వ‌స్తోంది. క‌నుక‌నే ఈమె అంటే చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. గ్లామ‌ర్ షో చేసేది లేద‌ని.. అలాంటి సీన్ల‌లో న‌టించేది లేద‌ని.. ఈమె గ‌తంలోనే ఖ‌రాఖండిగా చెప్పేసింది. అయిన‌ప్ప‌టికీ ఈమెకు సూట్ అయ్యే క్యారెక్ట‌ర్లు సినిమాల్లో వ‌స్తూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈమె న‌టించిన విరాట ప‌ర్వం మూవీ విడుద‌ల‌వుతోంది. ఈ మూవీ జూన్ 17న విడుద‌ల కానుండ‌గా.. ప్ర‌స్తుతం చిత్ర ప్ర‌మోష‌న్స్‌ను వేగంగా నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగానే మీడియా సంస్థ‌ల‌కు సాయిప‌ల్ల‌వి వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూలు ఇస్తోంది.

ఇక ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా సాయి ప‌ల్ల‌వి మాట్లాడుతూ.. చిరంజీవి చాలా గొప్ప న‌టుడ‌ని.. ఆయ‌న డ్యాన్స్ చాలా బాగా చేస్తార‌ని.. ఆయ‌న డ్యాన్స్ అంటే చాలా ఇష్ట‌మ‌ని.. ప్ర‌తి ఒక్క న‌టుడు లేదా న‌టి ఆయ‌న ప‌క్క‌న న‌టించాల‌ని కోరుకుంటార‌ని.. సాయిప‌ల్ల‌వి తెలియ‌జేసింది. అయితే అంత ఇష్టం ఉన్న‌ప్పుడు ఆయ‌న చేస్తున్న భోళాశంక‌ర్ సినిమాలో న‌టించాల్సిందిగా ఆఫ‌ర్ వ‌స్తే.. ఎందుకు న‌టించ‌లేద‌ని.. సాయిప‌ల్ల‌విని యాంక‌ర్ ప్ర‌శ్నించింది. దీంతో సాయిప‌ల్ల‌వి తాను చిరంజీవి సినిమాను ఎందుకు రిజెక్ట్ చేసిందీ.. తెలియ‌జేసింది.

Sai Pallavi told why she rejected Chiranjeevi movie
Sai Pallavi

భోళా శంక‌ర్ మూవీ రీమేక్ మూవీ. తాను రీమేక్‌ల‌లో న‌టించ‌వ‌ద్ద‌ని కండిష‌న్ పెట్టుకున్నాన‌ని సాయిప‌ల్ల‌వి తెలిపింది. రీమేక్ అంటే.. అస‌లు సినిమాలో ఎలా చేశారు.. ఇందులో ఎలా చేశారు.. అని రెండు సినిమాల‌ను పోలుస్తార‌ని.. ఒక‌వేళ అనుకున్న విధంగా రాకపోతే విమ‌ర్శ‌లు చేస్తార‌ని.. క‌నుక త‌న‌కు రీమేక్‌లు అంటే ప‌డ‌వ‌ని సాయిప‌ల్ల‌వి తెలిపింది. క‌నుక‌నే రీమేక్ సినిమాల్లో న‌టించ‌డం లేద‌ని.. కాబ‌ట్టే చిరంజీవి లాంటి న‌టుడితో భోళా శంక‌ర్‌లో చేసేందుకు అవ‌కాశం వ‌చ్చినా.. రిజెక్ట్ చేశాన‌ని.. తెలియ‌జేసింది. ఇక సాయిప‌ల్ల‌వి విరాట ప‌ర్వం సినిమాలో వెన్నెల పాత్ర‌లో న‌టించింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ కోసం ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment