Sai Pallavi : టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ప్రేమమ్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. సాయిపల్లవి లేటెస్ట్ గా సినీ ఇండస్ట్రీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన గ్లామర్ విషయంలో ఎన్నో భయాలుండేవట. సినిమాల్లో నార్మల్ లుక్ లో సింపుల్ గా కనిపించడానికే ఎక్కువగా ఇష్టపడతానని చెప్పింది.
ఈ క్రమంలోనే తన మొదటి సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు తన అందం గురించి విపరీతమైన ఆలోచనలు ఉండేవని.. వాటిపై ఒక క్లారిటీ లేక సతమతమయ్యేదాన్ని.. అని తెలిపింది. కాలేజ్ టైమ్ లోనే తాను సినిమాల్లోకి వచ్చానని సాయి పల్లవి తెలిపింది. సాధారణంగా సినిమాల్లో యాక్ట్ చేసే హీరోయిన్స్ కి ఫేస్ మీద మచ్చలు లేకుండా చక్కగా, అందంగా కనిపించేవారని పేర్కొంది.
కానీ తనకు ముఖం మీద ఎక్కువగా పింపుల్స్, మచ్చలు ఉన్నాయని, అందుకే తాను ఈ సినీ ఇండస్ట్రీలో సెట్ అవుతానా.. లేదా.. అని ఎన్నో రకాల ఆలోచనలు ఉండేవని సాయిపల్లవి తెలిపింది. ఈ విషయంలో తాను ఎన్నో సార్లు మానసికంగా బాధపడేదాన్నని.. ఒకవేళ సినిమాల్లోకి వెళ్ళాక.. ఈ హీరోయిన్ ఏంటి.. ఇలా ఉందంటూ.. కామెంట్స్ వస్తాయా.. అని అనుకునేదాన్నని తెలిపింది.
అయితే క్యారెక్టర్ కంటే పైకి కనిపించే అందాన్నే ఎక్కువగా ఇష్టపడతారు.. అనే విషయంపై తనకు స్పష్టత ఉందని సాయి పల్లవి వెల్లడించింది. కానీ మలయాళం ప్రేమమ్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యాక తాను ఆలోచిస్తున్న విధానం చాలా తప్పని.. తనకు మరింత స్పష్టంగా తెలిసిందని చెప్పింది. ఎవరైనా సరే పైకి కనిపించే అందాన్ని కాకుండా.. క్యారెక్టర్ నే ఎక్కువగా అభిమానిస్తారని అర్థమై.. మనసు తేలిక పడిందని చెప్పింది. తన సినీ కెరీర్ కు ఆత్మవిశ్వాసాన్ని నింపిన సినిమా ప్రేమమ్ అని.. ఈ సినిమా వల్లే తనలో ఆత్మ విశ్వాసం నిండిందని.. ఆమె తెలిపింది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…