Sai Pallavi : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్‌స్టోరీ. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద చక్కగానే కలెక్షన్లను రాబడుతోంది. అయితే భారత్ బంద్ రావడం, గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా.. కలెక్షన్లపై కొంత మేర ప్రభావం పడింది. కానీ రెండో వారం పూర్తయ్యే సరికి కలెక్షన్లు పుంజుకుంటాయని ఆశిస్తున్నారు.
ఇక లవ్ స్టోరీ మూవీ విడుదలైనా కూడా చిత్ర యూనిట్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా నాగచైతన్య, సాయిపల్లవి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన పలు విషయాలను సాయి పల్లవి మీడియాతో పంచుకుంది.
తాను ఎల్లప్పుడూ ముద్దు సన్నివేశాల్లో నటించలేదని, అలా ఇక ముందు కూడా చేయనని సాయి పల్లవి తేల్చి చెప్పింది. అయితే లవ్ స్టోరీలో నాగచైతన్యను ముద్దు పెట్టుకున్నట్లుగా ఉన్న సీన్ కెమెరా మెన్ ట్రిక్ అని తెలిపింది.
సినిమాల్లో ముద్దు సన్నివేశాలపై ముందుగానే దర్శకులను అడుగుతానని, అలాంటి సీన్లు లేవని చెబితేనే సినిమా చేస్తానని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఇక లవ్ స్టోరీ షూటింగ్‌కు ముందే శేఖర్ కమ్ములకు ఈ విషయం చెప్పి క్లారిటీ తీసుకున్నానని సాయి పల్లవి తెలియజేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…