RRR Movie : ఇండియన్ మోస్ట్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాపై అభిమనుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరో వైపు ఈ చిత్రానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నేపథ్యంలో ప్రమోషన్స్‌ని భారీగా చేస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి ముంబైలో తాజాగా సల్మాన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇంత పెద్ద సినిమా ప్రమోషన్ కోసం టీమ్ అంతా దేశం మొత్తం చుట్టేయాల్సిన అవసరం ఏర్పడింది. అవసరం మేర ఇతర భాషల బిగ్ స్టార్స్ ని రంగంలోకి దించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ ని రంగంలోకి దించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ముంబైలో కుమారుడు కార్తికేయతో రాజమౌళి మీడియా కంట పడిన సంగతి తెలిసిందే. మరి ముంబైలో జక్కన్నకు పనేంటి ? అంటే.. సల్మాన్ ని ప్రమోషన్ కోసం ఆహ్వానించాలని కుమారుడిని వెంట పెట్టుకుని వెళ్లారనే టాక్ వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ కి బాలీవుడ్ మార్కెట్ కీలకం కాబట్టి అక్కడ ముందుండి సల్మాన్ ప్రమోట్ చేస్తే కోట్లాది రూపాయల పబ్లిసిటీ ఉచితంగానే లభిస్తుంది. అందుకే జక్కన్న ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఇందులో నిజం ఎంత ? అన్నది తేలాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో `భజరంగి భాయిజాన్` చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ముందుగా జక్కన్నకే దక్కింది. బాహుబలి షూటింగ్‌తో బిజీగా ఉన్న నేపథ్యంలో జక్నన్న ఆ సినిమా చేయలేకపోయాడు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…