RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీ అస‌లు ఓటీటీ రిలీజ్ ఎప్పుడు ? ఆ తేదీలు కాదా..?

RRR Movie : ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం యావత్‌ దేశం వేయి కళ్లతో ఎదురు చూడ‌గా, ఈ సినిమా మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్) లు హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు చెరిపేస్తోంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌ సునామీ సృష్టిస్తోంది. ఇదిలా ఉండ‌గా ఇటీవల సినిమాలు థియేటర్లలో వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి రావడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ఎంట్రీ ఎప్పుడనే దానిపై కూడా చర్చ ప్రారంభమైంది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా థియేటర్లలో వచ్చిన కనీసం 90 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది.

RRR Movie

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్ట్రీమింగ్‌ హక్కులతో పాటు హిందీకి సంబంధించి శాటిలైట్‌ హక్కులను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇందుకుగాను జీ గ్రూప్‌ ఏకంగా రూ.300 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. జూన్‌ రెండవ వారంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందని టాక్‌. ఇదిలా ఉండ‌గా ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, స్పానిష్‌ భాషలకు గాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్‌ను 2 నెలల్లోనే ఓటీటీకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నార‌ని మే 1వ తేదీ నుంచి దక్షిణాది భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్‌ చేసేందుకు జీ5 ప్లాన్‌ చేస్తున్నట్లు ప్ర‌చారాలు చేశారు.

ఇక హిందీ వెర్షన్‌ మాత్రం నెటిఫ్లిక్స్‌లో 3 నెలల తర్వాత అంటే జూన్‌లోనే స్ట్రీమింగ్‌ కానుందని చెప్పుకొచ్చారు. అయితే ఇవ‌న్నీ పుకార్లేన‌ని కొట్టిపారేశారు. జూన్‌లో ఈ సినిమా ఓటీటీకి రానుంద‌ని టాక్. మ‌రి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. కాగా ఇందులో తారక్‌, చరణ్‌ల నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ విడుదలైన మూడో రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టి రూ. 500 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ప్ర‌స్తుతం రూ.700 కోట్ల‌కి పైగా క‌లెక్ష‌న్స్ సాధించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM