RRR Movie : ఎన్‌టీఆర్, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25వ తేదీన విడుదలై భారీ విజయాన్ని సాధించింది. విడుదలైన అన్ని చోట్లా భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ మూవీకి రూ.1000 కోట్లకు పైగానే వచ్చాయి. సినిమాకు రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల పాటు ఆర్ఆర్ఆర్ హవా కొనసాగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో అల్లూరి పాత్రలో రామ్ చరణ్ నటించగా.. ఎన్‌టీఆర్ భీమ్ పాత్రలో అలరించారు. ఈ ఇద్దరి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఇక ఆర్ఆర్ఆర్ మేనియా ఇంకా కొన్ని రోజులు కొనసాగుతుందని తెలుస్తోంది. కానీ ఓటీటీ రిలీజ్ మాత్రం కాస్త ఆలస్యం అయ్యేట్లు కనిపిస్తోంది. అన్ని సినిమాల్లాగే అయితే ఇంకో నాలుగు రోజుల్లో ఈ మూవీ ఓటీటీల్లోకి వచ్చి ఉండాల్సింది. కానీ సినిమా హిట్ కావడంతో ఓటీటీలోకి రావడం ఆలస్యం కానుంది. అయితే ఇంకో నెల రోజులు ఓపిక పడితే చాలు.. ఆర్ఆర్ఆర్ ను ఓటీటీలో వీక్షించవచ్చని తెలుస్తోంది.
ఈ మూవీకి గాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన డిజిటల్ హక్కులను జీ5 భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. దీంతో అదే యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఇక హిందీ, విదేశీ భాషల హక్కులను మాత్రం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ రెండు యాప్‌లలోనూ ఆర్ఆర్ఆర్ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. ఇక ఈ మూవీని జూన్ 3 నుంచి జీ5లో స్ట్రీమ్ చేస్తారని తెలుస్తోంది. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారమే. ఇంకా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కనుక ఆర్ఆర్ఆర్ మూవీ అసలు ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో ఇంకా తెలియడం లేదు. కానీ జూన్ మొదటి వారంలో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…