Roja : ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా కుర్రకారును ఓ ఊపు ఊపిపేసిన రోజా ఇటీవల టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించారు. రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ వైసీపీ ఫైర్ బ్రాండ్ గా మారారు. మంత్రి అయిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే తిరుగుతూ వస్తున్నారు. మినిస్టర్ అయినా.. తనకు నచ్చిన పాట వింటే మాత్రం తగ్గేదే లే అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నాడు చేసిన ఆ పాట రోజా హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నా.. ఆ పాటకు తాజాగా వేసిన స్టెప్పులు చూస్తే అసలు రోజా బయటకు వచ్చేశారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న హంసధ్వని తొమ్మిదవ వార్షికోత్సవ ముగింపు సభకు మంత్రి రోజా హాజరయ్యారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడంతో రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థ ద్వారా మూడు రోజుల పాటు అక్కడ ధ్యాన, నాట్య, సంగీత ప్రదర్శనలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అక్కడ చామంతి పువ్వా.. పువ్వా.. అంటూ తన హిట్ సాంగ్ ప్లే చేస్తే మంత్రి రోజా డైరెక్టర్ స్వాతి సోమనాథ్ తో కలిసి డాన్స్ చేశారు. ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి రోజా.. తన డ్యాన్సుతో అలరించారు. రోజాతోపాటు అక్కడ ఉన్న వారు కూడా డాన్స్ చేయడంతో ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.
మంత్రిగా ఉంటూనే స్టెప్పులు వేయడంపై ఆనందిస్తూ.. అభినందించిన వారు కొందరైతే.. మంత్రిగా ఉంటూ ఆ స్టెప్పులు ఏంటంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రోజాకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ర్యాంకుల కోసం పరుగుల తీస్తున్న పిల్లలు ఒత్తిడిని జయించడానికి మంచి కళలు, సంగీతం, నాట్యం ఉపయోగపడతాయని హితబోధ చేశారు.
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…