RGV : ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను అవ‌మానించి చివ‌ర‌కు ఆయ‌న కాళ్ల‌నే ప‌ట్టుకున్న వ‌ర్మ‌..!

RGV : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌ర్మ‌, న‌ట్టి కుమార్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. గురువారం ఆర్జీవీపై నట్టి కుమార్‌ చీటింగ్‌ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆర్జీవీ వివరణ ఇస్తూ ట్విటర్‌లో వీడియో రిలీజ్‌ చేశాడు. నట్టి కుమార్‌ నోటీసులకు నా అడ్వకేట్‌ సమాధానం ఇస్తాడు. ఇక నాపై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలుసు. ప్రెస్‌మీట్‌లు పెట్టడం వాళ్ళని వీళ్ళని తిట్టడం తప్ప అతని లైఫ్‌లో ఏం లేదని అనుకుంటున్నా.. అంటూ ఫైర్ అయ్యాడు. ఈ నేప‌థ్యంలో న‌ట్టి కుమార్ తాజాగా స్పందిస్తూ వ‌ర్మ‌ని ఏకి పారేశాడు.

RGV

ఒక‌ప్పుడు గ్రేట్ డైరెక్ట‌ర్ వ‌ర్మ ఇప్పుడు ఛీటింగ్ వ‌ర్మగా మారారు. చాలా మందికి డ‌బ్బులు ఎగ్గొట్టాడు. ఎవ‌రైనా డ‌బ్బులు అడుగుతుంటే త‌ప్పించుకుని తిరుగుతున్నాడు. రోజుకొకరిని అడ్డు పెట్టుకున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు తుమ్మ‌ల ప్ర‌స‌న్న‌కుమార్‌ను అడ్డు పెట్టుకున్నాడు. ఇప్పుడు రామ స‌త్య‌నారాయ‌ణ అనే బ్రోక‌ర్‌ను అడ్డు పెట్టుకున్నాడు. ఛాంబ‌ర్ నా చేతిలో ఉందిగా డ‌బ్బులు ఎగ్గొడ‌తాం అన్న‌ట్లు ప్ర‌వ‌రిస్తున్నాడు. ముంబైలో నా ఆఫీసు ఖ‌రీదు ఐదు వంద‌ల కోట్లు అని అన్నాడు. దానికి రెంట్ క‌ట్ట‌క రాత్రికి రాత్రే పారిపోయి వ‌చ్చేశాడు. గోవాలో చాలా అప్పు చేశాడు. అక్క‌డ ప‌నిచేసిన డ్రైవ‌ర్‌కి డ‌బ్బులు ఇవ్వ‌లేదు. అత‌ను ప‌బ్‌లో వ‌ర్మ‌ను చిత‌క బాదాడ‌ట‌. అంత‌క‌న్నా ఇంకేం బ‌తుకు. అవ‌స‌ర‌మా త‌న‌కు. డ్రైవ‌ర్స్‌కు జీతాలు ఇవ్వ‌లేద‌ని, తిండి పెట్ట‌లేద‌ని డ్రైవ‌ర్స్ యూనియ‌న్స్ చెబుతున్నాయి.

ఆర్జీవీ నువ్వు మ‌గాడివైతే ఎక్కడికి రావాలో చెప్పు ఒక్క‌డిగానే వ‌స్తాను. ఇంటికి రావాలా, ఆఫీసుకి రావాలా ? వ‌స్తాను. నా ఒంటి మీద చెయ్యి వేస్తే నేను నా డ‌బ్బుల‌ను వ‌ద‌లుకుంటాను. నాతో ఛాలెంజ్ చేసే మ‌గాడివా నువ్వు. అంద‌రికీ డ‌బ్బులు ఇచ్చి మాట్లాడు. డ‌బ్బులు నువ్వు క‌డ‌తావా, రామ స‌త్య‌నారాయ‌ణ క‌డ‌తాడా.. లేక ప్ర‌స‌న్న క‌డ‌తాడా ! ఎవ‌రు ఇస్తారో చెప్పండి. చిరంజీవిగారినో, సురేష్‌బాబుగారినో ఇంకేవ‌రినో నేను వ్య‌క్తిగ‌తంగా తిట్ట‌లేదు. ఏదైనా ఇష్యూ ఉన్న‌ప్పుడు వాటిపై స్పందించాను. ప‌ది మందికి ప‌నికొచ్చే ప‌ని చేశాను. నీలాగా ప‌నికిమాలిన ట్వీట్స్ చేయ‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అవ‌మానించి, ఆయన్ని అవ‌మానించేలా సినిమా తీసి, చివ‌ర‌కు ఆయ‌న కాళ్లే ప‌ట్టుకున్నావు. ఒక సినిమాని ఇద్ద‌రు ముగ్గురికి అమ్ముతున్నావ్. దిశా ఎన్‌కౌంట‌ర్ సినిమాను ఇద్ద‌రికి అమ్మాడు. ఒక‌రి ద‌గ్గ‌ర రూ.56 ల‌క్ష‌లు, మ‌రొక‌రి ద‌గ్గ‌ర రూ.75 ల‌క్ష‌లు తీసుకున్నాడు. అలాగే ల‌డ్‌ఖీ సినిమా మాది. దాన్ని మ‌రొక‌రికి అమ్మాడు. ఇలా చాలా విష‌యాల గురించి మాట్లాడుతూ.. న‌ట్టి కుమార్‌.. వ‌ర్మ‌ని ఏకి పారేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM