Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తుంటారు. అయితే ఆమె గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టడం లేదు. దీంతో ఆమెకు ఏమైందోనని అభిమానులు ఖంగారు పడ్డారు. అయితే తాను బాగానే ఉన్నానని చెబుతూ తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లకు అకీరా నందన్, ఆద్యలు ఇద్దరు పిల్లలు కాగా.. ఆద్యతో కలిసి దిగిన ఫొటోను రేణు దేశాయ్ తన సోషల్ ఖాతాల్లో షేర్ చేశారు. తన రియల్ లైఫ్ హీరో ఆద్య తన సెల్ఫీని ఫొటోబాంబింగ్ చేస్తుందని రేణు కామెంట్ పెట్టారు.
ఇక ఈ పోస్టుతోపాటు ఆమె ఓ కామెంట్‌ను కూడా పెట్టారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, సోషల్ మీడియాకు చిన్న బ్రేక్ ఇచ్చానని, అందుకనే ఇన్ని రోజుల పాటు పోస్టులు పెట్టలేదని తెలియజేశారు. తన గురించి ఖంగారు పడ్డ అభిమానులకు, మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తాను ఇప్పుడు బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు.
కాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోనే విద్యను అభ్యసిస్తున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…