Rashmika Mandanna : అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక, అనసూయ, సునీల్ ఇలా అందరూ డీ గ్లామరస్ లుక్ లో కనిపించనున్నారు. పక్కా మాస్ కమర్షియల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్న విషయం తెలిసిందే.
అయితే ముట్టుకుంటే కందిపోయేలా ఉండే రష్మికను డీగ్లామర్‌గా చూపించడానికి ఎంత మేకప్ వేశారనేది, తాజాగా రష్మిక పోస్ట్ చేసిన ఓ ఫోటో ఈ విషయాన్ని చెబుతోంది. షూటింగ్ స్పాట్‌లో తన చేతిని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది రష్మిక. లంచ్ సమయంలో చేతులు కడుక్కోగా కేవలం అరచేతి భాగం మాత్రమే మేకప్ లేకుండా ఉంది. పై భాగం అంతా మొత్తం మేకప్‌తో నిండిపోయింది. రష్మికను డీగ్లామర్‌గా చూపించడానికి సుకుమార్ ఎంతలా జాగ్రత్త తీసుకున్నాడో ఈ ఒక్క ఫోటో చూస్తే అర్థమవుతోంది.
శ్రీ వల్లి పాత్ర పోషిస్తున్న రష్మిక లుక్స్ ఇప్పటికే విడుదల కాగా, ఇవి ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించాయి. ‘ఛలో’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న అందాల తార రష్మిక మందన్నా.. రెండో చిత్రం ‘గీత గోవిందం’తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరింది. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస విజయాలు, భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పుడు తెలుగే కాదు తమిళం, హిందీ భాషలలోనూ సినిమాలు చేస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…