Rashmika Mandanna : అందాల భామ రష్మిక క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. అంతే కాదు.. స్టార్ హీరోలకు ఇప్పుడు ఈ అమ్మడే ఫస్ట్ ఛాయిస్ అవుతుంది. కేవలం దక్షిణాదిన మాత్రమే కాకుండా.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు ఆమె సిద్దమవుతుంది. ఇక ఇటు తెలుగులోనూ పుష్ప 2లో నటించనుంది. అంతేకాకుండా నేషనల్ క్రష్ గా కూడా బిరుదు అందుకుంది. ఇక ఈ పాపులారిటీతోనే బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంది. అయితే చాలా కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రూమర్స్ ని రష్మిక, విజయ్ ఖండించలేదు అలాగని అంగీకరించలేదు. వీళ్ళిద్దరూ ఓపెన్ గానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కానీ తమ మధ్య రిలేషన్ గురించి మాత్రం ఓపెన్ అవడం లేదు. రోజులు గడిచే కొద్దీ రష్మిక, విజయ్ ల మధ్య బంధం బలపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్ట్ లో మెరిశారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం వీరిద్దరూ మాల్దీవులకు రొమాంటిక్ టూర్ కి వెళుతున్నట్లు తెలుస్తోంది. పెళ్ళికి ముందే వీళ్ళు రొమాంటిక్ టూర్స్ కి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.
రష్మిక వైట్ డ్రెస్ లో, విజయ్ దేవరకొండ క్యాజువల్ వేర్ లో స్టైలిష్ గా కనిపించారు. విజయ్, రష్మిక కలసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో వీరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్, రష్మిక మధ్య లిప్ లాక్ సన్నివేశం కూడా హాట్ టాపిక్ గా మారింది. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం గుడ్ బై రిలీజ్ అవుతుండడం విశేషం. ఒకవైపు తన సినిమా రిలీజ్ అవుతుంటే.. మరోవైపు రష్మిక.. ప్రియుడితో వెకేషన్ కి వెళ్ళింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళు పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…