Godfather 2nd Day Collections : సాలిడ్‌గా నిల‌బ‌డ్డ గాడ్ ఫాద‌ర్.. రెండో రోజు వ‌సూళ్లు ఎంతంటే..?

Godfather 2nd Day Collections : గాడ్ ఫాద‌ర్ సినిమా చిరంజీవి కెరీర్ లో వ‌సూళ్ల ప‌రంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవ‌కాశం క‌నిపిస్తుంది. మొదటి రోజు ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.38 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. థియేట‌ర్ల వ‌ద్ద జోరు కొన‌సాగిస్తుంది. సోష‌ల్ మీడియాలో ఈ మూవీకి అనుకూలంగా విప‌రీతంగా పాజిటివ్ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక రెండ‌వ రోజైన గురువారం నాడు ఈ చిత్రం రూ.31 కోట్ల వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్ సొంతం చేసుకుంది. ఇది చాలా భారీ మొత్తం అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. మొత్తం మీద రెండు రోజుల్లో ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.69 కోట్ల గ్రాస్ సాధించిన‌ట్లైంది.

రీమేక్ రాజాగా పిల‌వ‌బ‌డే ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా డైరెక్ష‌న్ లో మ‌ళ‌యాళ‌ సూప‌ర్ హిట్ లూసిఫ‌ర్ కి రీమేక్ గా గాడ్ ఫాద‌ర్ చిత్రాన్ని రూపొందించారు. చిరంజీవి చెల్లెలుగా న‌య‌న తార కీల‌క పాత్ర‌లో న‌టించింది. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ మొదటి సారిగా తెలుగులో గాడ్ ఫాద‌ర్ సినిమా ద్వారా ఒక ముఖ్యమైన క్యారెక్ట‌ర్ లో న‌టించాడు. అయితే ఈ గాడ్ ఫాద‌ర్ సినిమా ఆచార్య కంటే కూడా థియేట‌ర్ల ప‌రంగా త‌క్కువ సంఖ్య‌లోనే విడుద‌ల అయ్యింది.

Godfather 2nd Day Collections

ప్ర‌స్తుతం టికెట్ రేట్లు కూడా ఇదివ‌ర‌కంటే త‌క్కువ‌గానే ఉండడం గ‌మ‌నించ‌వ‌చ్చు.అయిన‌ప్ప‌టికీ మంచి వ‌సూళ్లు సాధించ‌డం సంతోషించద‌గిన విష‌యం అని చెబుతున్నారు. ద‌స‌రా సీజ‌న్ సెల‌వులు ఈ చిత్రానికి బాగా క‌లసి వ‌చ్చాయ‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. వీకెండ్ క‌లెక్ష‌న్లు ఇంకా భారీగా ఉండ‌బోతున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM

విడాకుల తర్వాత గోల్డెన్ టెంపుల్‌లో హన్సిక.. వైరల్ అవుతున్న ‘కీలక’ పోస్ట్!

వ్యాపార వేత్త సోహైల్ ఖ‌తురియాతో విడాకులు తీసుకున్న అనంత‌రం హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీల‌క పోస్టు…

Wednesday, 18 March 2026, 12:31 PM

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM