Rashmika Mandanna : ఇటీవలి కాలంలో చాలా మంది స్టార్స్ వివాదాస్పద ప్రకటనలలో నటిస్తూ నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి వారు తాము చేసిన తప్పులని గ్రహించి క్షమాపణలు చెప్పారు. అల్లు అర్జున్ అయితే పొగాకు ప్రకటనలో నటించేందుకు ఆసక్తి కూడా చూపలేదు. డబ్బుల కోసం తప్పుడు ప్రకటనలు చేస్తే అభిమానుల ఆగ్రహానికి తప్పక గురవుతున్నారు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే రష్మిక చేసిన యాడ్ ఇప్పుడు ఒకటి వివాదాస్పదంగా మారింది. ఆమె అభిమానులు రష్మికపై ఆగ్రహంగా ఉన్నారు.
నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక ప్రస్తుతం సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ వరుస సినిమాలు చేస్తోంది. హిందీలో హీరోయిన్ రష్మిక మందన్నా క్రేజ్ మెల్లి మెల్లిగా పెరుగుతోంది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్నులో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో బాలీవుడ్‌కు రష్మిక పరిచయం కాబోతుంది. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. అలాగే అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ చేసిన డాడీ (ప్రజెంట్ టైటిల్) చిత్రంలో రష్మిక మరో లీడ్ క్యారెక్టర్ చేసింది. తండ్రీకూతుళ్ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి వికాస్ బాల్ దర్శకుడు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.
కాగా రష్మిక తాజాగా హీరో వరుణ్ ధావన్‌తో కలిసి కింగ్ ఫిషర్ సోడా యాడ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో శనివారం విడుదల కాగా.. దీనిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యానికి హాని చేసేటువంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు.. అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలో, వరుణ్ పాప్ స్టార్‌గా కనిపిస్తాడు, అతను వేదికపై తనతో కలిసి డాన్స్ చేయడానికి రష్మికను ఆహ్వానిస్తాడు. ఇద్దరూ కలిసి ఒక క్లబ్‌లో డ్యాన్స్ చేస్తూ, ఆ తర్వాత బీచ్‌లో కనిపిస్తారు. కింగ్ ఫిషర్ యాడ్ కోసం వీరిద్దరూ చేసిన రచ్చ కొంద మందికి నచ్చినా మరి కొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు.
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…