Rashmika Mandanna : నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్‌లతో ఎంతో బిజీగా ఉంది. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా మారిన రష్మిక మందన్న ప్రస్తుతం 4 బాలీవుడ్ సినిమాల్లో వరుసగా నటిస్తూనే ఉంది. అందుకు గాను ఈమె ముంబైలో ఏకంగా ఓ ఇంటినే కొనుగోలు చేసింది. ఇక రష్మిక మందన్న ఎక్కడ కనిపించినా నవ్వుతూ చాలా సరదాగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొనగా.. అభిమానులు ఫొటోల కోసం ఎగబడ్డారు. అయినప్పటికీ ఎంతో ఓపిగ్గా ఆమె వారితో ఫొటోలు దిగింది.
అయితే రష్మిక మందన్న తన ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగిన అనంతరం తన కారవాన్‌లోకి వెళ్తుండగా.. ఓ అభిమాని వచ్చి ఫొటో కావాలని అడిగాడు. అయితే పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు అతన్ని వెనక్కి పంపించేయబోయాడు. కానీ రష్మిక అతన్ని వారిస్తూ ఎంతో ఓపిగ్గా తన అభిమానితో కలసి ఫొటో దిగింది. కాగా ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే రష్మిక మందన్న తన ఫ్యాన్స్‌పై చూపిస్తున్న ఆప్యాయతకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమెకు ఓపికకు సహనానికి ఆమెను అభినందిస్తున్నారు. ఫ్యాన్స్‌తో స్టార్స్ ఇలాగే ఉండాలి.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా రష్మిక మందన్న ప్రస్తుతం మిషన్ మజ్ను, గుడ్ బై అనే హిందీ సినిమాలతోపాటు సీతా రామమ్ అనే తెలుగు సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అలాగే తమిళంలో ఈమె విజయ్ పక్కన నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక త్వరలోనే పుష్ప 2 తోపాటు హిందీలో యానిమల్ అనే మరో మూవీలోనూ ఈమె నటించనుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…