Meera Jasmine : తెలుగు సినీ ప్రేక్షకులకు మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు గుడుంబా శంకర్ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. అంతకు ముందు తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో అనేక సినిమాలు చేసినప్పటికీ గుడుంబా శంకర్ మూవీ ద్వారానే ఈమెకు తగిన గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగులో ఆఫర్లు వచ్చాయి. ఆ తరువాత ఆమె భద్రలో ఫ్యామిలీ హీరోయిన్ పాత్రలో నటించి అలరించింది. అలాగే రారాజు, మహారథి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవేవీ పెద్దగా హిట్ కాలేదు.
ఇక ఆ తరువాత ఈమె నటించిన అమ్మాయి బాగుంది.. అనే మూవీ ఒక్కటే ఫర్వాలేదనిపించింది. తరువాత ఈమె సినిమాలు ఏవీ తెలుగులో హిట్ కాలేదు. కానీ ఇతర భాషల చిత్రాల్లో లెక్కకు మించి సినిమాలే చేసింది. అయితే ఎంతో కాలం నుంచి సినీ ఇండస్ట్రీకి దూరమైన మీరా జాస్మిన్ ఈమధ్య మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఈమె సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. అందులో తన గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. ఈ అమ్మడు గతంలో ఫ్యామిలీ హీరోయిన్‌గా కనిపించింది. కానీ ఇప్పుడు గ్లామర్ డోసు పెంచి కనిపిస్తోంది. ఈమె ఇటీవలి కాలంలో పోస్ట్ చేసిన చాలా వరకు ఫొటోల్లో అందాలు ఆరబోసినవే ఉంటున్నాయి. ఇక తాజాగా మరోమారు ఈమె అలాంటి ఫొటోలనే షేర్ చేసి యువత గుండెల్లో చిచ్చు పెట్టింది.
మీరా జాస్మిన్ తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో తన అందాలకు చున్నీని అడ్డుగా పెట్టుకుని కవ్విస్తూ ఫొటోలు దిగింది. అనంతరం వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె చున్నీ అడ్డుగా పెట్టుకుంది కాబట్టి సరిపోయింది.. లేకపోతే అందాల జాతరేనని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ అమ్మడి గ్లామర్ షో చూసి అయినా ఈమెకు అవకాశాలు ఇస్తారో.. లేదో.. చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…