Rashmi Gautam : సోషల్ మీడియా వాడకం పెరిగాక నెటిజన్స్ కామెంట్స్ కి హద్దు అదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్, స్టార్ యాంకర్స్ ని పబ్లిక్ గా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ పరువు తీస్తున్నారు. ఇలా చాలామంది హీరోయిన్స్ కి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి, హీరోలకి అందరికీ జరిగింది. ఇటీవల సీనియర్ యాంకర్ అనసూయను పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఆంటీ అంటూ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జబర్ధస్త్ యాంకర్ రష్మికి ఇలాంటి అనుభవమే ఎదురయింది. బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రష్మీ గౌతమ్.
చాలాకాలంగా ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి సైతం హోస్ట్ గా చేస్తుంది. చూడ చక్కని రూపంతో పాటు అదిరిపోయే హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ భామ.. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలాకాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో రష్మి చేసే పోస్టులకు విపరీతమైన స్పందన వస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన రష్మికి నెటిజన్స్ నుంచి భయంకరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఓ నెటిజన్.. రష్మి నువ్వు ఆ పనికిమాలిన చెత్త షోస్ ఎందుకువచేస్తున్నవ్.. హీరోయిన్ గా ట్రై చేయొచ్చుగా అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి రష్మీ రిప్లై ఇస్తూ.. నా దగ్గర మంచి మంచి స్టోరీలు ఉన్నాయి. నేను హీరోయిన్ గా నటిస్తాను. నువ్వు సినిమా నిర్మిస్తావా చెప్పూ.. ఇప్పుడే యాంకరింగ్ మానేసి వస్తాను అంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఆ నెటిజన్ ఏమి చెప్పలేక సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం రష్మి ఆన్సర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇలానే ఉండాలి, ఇలాంటి తప్పుడు ప్రశ్నలు అడిగే వాళ్లకి పగిలిపోయే ఆన్సర్ ఇస్తేనే కరెక్ట్ అంటూ రష్మిని పొగిడేస్తున్నారు నెటిజన్లు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…