Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ఎప్పుడూ చర్చనీయాంశం అవుతున్నాయి. వీటన్నింటికి తెర దించుతూ ఎట్టకేలకు నయన్.. డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుని అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్ని రోజులు భర్తతో హనీమూన్ కి వెళ్లి వచ్చిన అనంతరం మళ్లీ షూటింగ్ లో బిజీ అయింది నయనతార. అయితే ప్రస్తుతం నయన్ రెమ్యూనరేషన్ గురించి చర్చ జరుగుతుంది. బాలీవుడ్‌కి చెందిన దీపికా పదుకొణె మరియు అలియా భట్‌లను అధిగమించి దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే సూపర్‌స్టార్ నటి నయన్ అని టాక్ నడుస్తోంది.
లేటేస్ట్ సమాచారం ప్రకారం నయన్ ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఆమె ఆస్తి విలువ దాదాపు రూ.165 కోట్లు ఉందట. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉంటుంది. ఇందుకుగానూ ఒక్కో సంస్థ నుంచి రూ. 5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. అలాగే ఆమెకు హైదరాబాద్ లో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో ఆధునాతన వసతులతో కూడిన నాలుగు ప్లాట్లు, కేరళలోని తన తల్లిదండ్రులు నివసిస్తున్న ఇల్లు.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సొంత ఇళ్లను ఏర్పాటు చేసుకుందట.
హైదరాబాద్ లోని ఒక్కో ప్లాట్ సుమారు రూ.15 కోట్లు విలువ చేస్తుందట. అంతేకాకుండా ఆమెకు ప్రత్యేకంగా ఒక జెట్ విమానం కూడా ఉందని సమాచారం. ఇక గత కొద్ది రోజులుగా నయన్ సినిమాల కంటే బిజినెస్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలతో భాగస్వామ్యం కూడా ఏర్పర్చుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నయన్.. డైరెక్టర్ అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తుంది. మెగాస్టార్ చిరు యొక్క గాడ్ ఫాదర్ లో నటించింది. అలాగే ప్రేమమ్ దర్శకుడి తదుపరి చిత్రం గోల్డ్ లో నటించనుంది నయనతార.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…