Dengue Fever : ప్రస్తుత సీజన్‌లో డెంగ్యూ అధికంగా విస్తరిస్తోంది. డెంగ్యూ కారణంగా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దోమ కాటు వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూ జ్వరం కారణంగా రోగి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం జరుగుతుంది. దీంతోపాటు శరీరంలో విపరీతమైన నొప్పి, కీళ్ల నొప్పులు, శారీరక బలహీనత, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే డెంగ్యూ వచ్చినప్పుడు ఆ జ్వరం ఎంతకాలం ఉంటుందోనని భయాందోళనకు గురవుతుంటారు. ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మంచి పోషకాలున్న ఆహారం తీసుకొని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి.
సీడీసీ (వ్యాధి నియంత్రణ మరియు నివారణకు కేంద్రం) వివరాల ప్రకారం.. డెంగ్యూ లక్షణాలు సాధారణంగా 2-7 రోజుల వరకు ఉంటాయి. చాలా మంది 1 వారంలోపు కోలుకుంటారు. డెంగ్యూ వచ్చిన మొదట్లో ఇతర వ్యాధులను సూచిస్తాయి. దీంతో చాలామంది డెంగ్యూ, వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతుంటారు. డెంగ్యూ జ్వరంలో నొప్పి లేదా చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇది కాకుండా కంటి నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, ఎముకల నొప్పి, వికారం/వాంతులు, కీళ్ల నొప్పులు మొదలైనవి ఉంటాయి.
జ్వరం వచ్చినా, డెంగ్యూ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరాన్ని నియంత్రించడానికి, నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వైద్యుడు సూచించిన యాంటీ బయాటిక్స్ తీసుకోండి. వైద్య సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదు. హైడ్రేటెడ్ గా ఉండటానికి ద్రవాలు సేవిస్తుండాలి. ఎలక్ట్రోలైట్స్ జోడించిన నీరు లేదా పానీయాలు తాగడం ఉత్తమం. శిశువులు, పిల్లలు లేదా వృద్ధులలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. డెంగ్యూ వచ్చిన వారు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…