Rashmi Gautam : బుల్లితెరపై ప్రముఖ యాంకర్ గా రష్మీ ఎంతో పేరు తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతోంది. స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్న రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అలాగే మూగజీవాల పట్ల స్పందిస్తూ ఉంటుంది. వాటికి ఏదైనా జరిగితే ఆమె అస్సలు ఊరుకోదు.
మూగజీవాల పట్ల ఎంతో ప్రేమ చూపించే రష్మీ వాటికి ఏమైనా అయితే మాత్రం వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటుంది. గతంలో లాక్ డౌన్ సమయంలో ఈమె ఎన్నో మూగజీవాలకు ఆహారం పెట్టి వాటి పట్ల తనకున్న ప్రేమను చాటుకుంది. హైదరాబాద్ నగర వీధులలో కుక్కలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసి వాటి సంరక్షణ చేపట్టాలని సూచించింది.
ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి సోషల్ మీడియా వేదికగా మూగజీవాల పట్ల ఉన్న తన ప్రేమను తెలియజేసింది. మూగజీవాలను ఎవరైనా హింసిస్తే వారికి తనదైన శైలిలో లెఫ్ట్ రైట్ ఇస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి తను పెంచుకున్న కుక్కను ఎంతో దారుణంగా హింసిస్తూ కనిపించాడు. ఈ వీడియోని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన రష్మి.. ఈ వ్యక్తి మానవత్వం మరిచి పోయి ఎంత దిగజారి పోయాడు. ఇలాంటి వారికి భూమి మీద ఉండే అర్హత లేదు.. అంటూ ఘాటుగా కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…