Rashi Khanna : రాశి ఖ‌న్నా లిప్‌లాక్ సీన్‌.. రెచ్చిపోయిందిగా..!

January 29, 2022 5:26 PM

Rashi Khanna : ప్ర‌స్తుత త‌రుణంలో ఓటీటీ వేదిక‌గా వ‌స్తున్న సినిమాలు, సిరీస్‌లు పాపుల‌ర్ అవుతున్నాయి. దీంతో న‌టీన‌టులు వాటిల్లో న‌టించేందుకు కూడా ఆస‌క్తి చూపిస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తున్న తార‌లు కూడా ఓటీటీల్లో క‌నిపించేందుకు త‌హ‌త‌హ లాడుతున్నారు. అందులో భాగంగానే వారు ప‌లు సిరీస్‌లు, సినిమాల్లో న‌టిస్తున్నారు. ఇక ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్ కూడా ఓటీటీ బాట ప‌ట్టారు.

Rashi Khanna scene in latest series

అజ‌య్ దేవ‌గ‌న్ తొలిసారిగా ఓటీటీ సిరీస్‌లో న‌టిస్తున్నారు. రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ పేరిట త్వ‌ర‌లో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ఓ సిరీస్ ప్ర‌సారం కానుంది. దీనికి సంబంధించిన ట్రైల‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో రాశి ఖ‌న్నా మ‌రో ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది. అయితే రాశి ఖ‌న్నాకు, అజ‌య్ దేవ‌గ‌న్‌కు మ‌ధ్య లిప్ లాక్ స‌న్నివేశం ఉంటుంద‌ని ట్రైల‌ర్‌ను చూస్తే తెలుస్తోంది. మ‌రి సిరీస్‌లో ఆ సీన్‌ను పెడ‌తారా, లేదా.. అన్న‌ది తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

ఏది ఏమైనా.. రాశి ఖ‌న్నా మాత్రం ఈ సిరీస్‌లో రెచ్చిపోయింద‌ని ట్రైల‌ర్‌ను చూస్తే అర్థం చేసుకోవ‌చ్చు. ఇక సిరీస్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంగా రూపొందుతోంది. ఇందులో అజ‌య్ దేవ‌గ‌న్ భార్య పాత్ర‌లో ఈషా డియోల్ న‌టించింది. అతి త్వ‌ర‌లోనే ఈ సిరీస్‌ను ప్ర‌సారం చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now