Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాల ద్వారానే పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి. తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయట పెట్టేస్తూ ఉంటాడు. అవి కాస్తా వివాదాలను సృష్టిస్తూ ఉంటాయి. దీంతో అతను అందరి దృష్టిలో పడుతూ ఉంటాడు. ఒక రకంగా తనకు కావల్సింది కూడా అదే అని చెప్తూ ఉంటాడు. అందుకే వివిధ సందర్భాల్లో అలాంటి వాఖ్యలు చేస్తూ ఉంటాడు. అయితే ఆయన ఇదివరకే అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాని గే స్టోరీ గా అభివర్ణించారని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాను సర్కస్ లా ఉందని అన్నాడు.
ఆర్జీవీ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తనకి ఆర్ఆర్ఆర్ సినిమాను చూస్తుంటే సర్కస్ చూసినట్టుగా అనిపించిందని అన్నారు. ఇంకా తనకు ఎవరినీ కించ పరిచే ఉద్దేశం లేదని, తనని తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పడం జరిగింది. అయితే తాను ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసినప్పుడు గొప్ప అనుభూతికి లోనయ్యానని, ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చిన్న బాలున్ని కాపాడే సన్నివేశం బాగుంటుందని అన్నారు. అంతే కాకుండా వారిద్దరూ ఆ సీన్ లో జెమినీ సర్కస్ లో ఉండే ప్రొపెషనల్ జిమ్నాస్టిక్ చేసేవాళ్లలా అనిపించారని తన అభిప్రాయాన్ని వివరించారు.
ఇదే సందర్భం లో రామ్ గోపాల్ వర్మ తాను మణిరత్నంతో కలిసి పని చేసిన రోజులను కూడా గుర్తు చేసుకున్నారు. ఆర్జీవీ మాట్లాడుతూ.. తను చేసే పనులు మణిరత్నంకి నచ్చవని, అలాగే మణిరత్నం చేసే పనులు కూడా తనకు నచ్చవని పేర్కొన్నారు. అయినప్పటికీ తామిద్దరం కలిసి దొంగ దొంగ ఇంకా గాయం సినిమాలు చేయడం జరిగిందని, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉండేవని అన్నారు. ఇంకా తన కెరీర్ లో క్షణక్షణం, సర్కార్ సినిమాలను మాత్రమే ముందుగా అనుకున్న హీరోతో అలాగే పక్కా కథ, స్క్రీన్ ప్లేల తో తీశాననీ, కానీ మిగిలిన సినిమాలన్నీ అలా జరగలేదని వివరించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…