Rakul Preet Singh : రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌.. త్వరలో పెళ్లి.. ప్రేమించిన వ్యక్తితోనే..!

October 10, 2021 2:52 PM

Rakul Preet Singh : అందాల ముద్దుగుమ్మ‌లు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. ఇటీవ‌లి కాలంలో కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక వంటి ముద్దుగుమ్మ‌లు తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోగా, ఇప్పుడు ర‌కుల్ కూడా పెళ్లి పీట‌లు ఎక్కేందుకు సిద్ధ‌మైంది. ఈ అమ్మ‌డు తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో జాకీ భగ్నాని అనే వ్య‌క్తితో ఏడ‌డుగులు వేయబోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ ఏడాది నాకు అతి పెద్ద గిఫ్ట్ జాకీ భగ్నాని అంటూ త‌న పోస్ట్‌లో పేర్కొంది ర‌కుల్‌. త్వ‌ర‌లోనే వీరి వివాహానికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానున్న‌ట్టు తెలుస్తోంది. జాకీ భ‌గ్నానీ బాలీవుడ్ న‌టుడు, నిర్మాత‌. ఆయ‌న ఫొటో కూడా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది ర‌కుల్.

Rakul Preet Singh to marry jackky bhagnani very soon

‘కెరటం’ సినిమాతో పరిచయమై రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఆ మధ్య ఈ భామ ఎడా పెడా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి.

https://www.instagram.com/p/CU1x-zyq5L0/

ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో బిజీగా ఉంది. న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ ఆమెకు వ‌ర‌స అవ‌కాశాలు ఇప్పిస్తున్నాడ‌నే వార్తలు వస్తున్నాయి. అజ‌య్ సినిమాతో కొంత‌కాలం కింద‌ట ర‌కుల్ బాలీవుడ్ లో గ్రాండ్ రీ ఎంట్రీ త‌ర‌హాలో క‌నిపించింది. ఆ సినిమా త‌ర్వాత అజ‌య్ వ‌ర‌స‌గా ఆమెకు అవ‌కాశాలు ఇస్తున్న‌ట్టుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా అక్క‌డ అజ‌య్ కు సంబంధించిన రెండు సినిమాల్లో ర‌కుల్ చేస్తోంది. వాటిల్లో ఒక‌దాన్ని అజ‌య్ దేవ‌గ‌ణ్ స్వ‌యంగా డైరెక్ట్ చేస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now