గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Rakul Preet Singh : బాయ్‌ఫ్రెండ్ తో క‌లిసి మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌..!

Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ మ‌ధ్య కాలంలో త‌న బాయ్ ఫ్రెండ్ జాకీ భ‌గ్నానితో క‌లిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా అత‌నితో క‌లిసి మాల్దీవ్స్‌కు…

Rakul Preet Singh : బాయ్‌ఫ్రెండ్ తో క‌లిసి మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌..!

Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ మ‌ధ్య కాలంలో త‌న బాయ్ ఫ్రెండ్ జాకీ భ‌గ్నానితో క‌లిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా అత‌నితో క‌లిసి మాల్దీవ్స్‌కు వెకేష‌న్‌కు వెళ్లింది. అక్క‌డ తీసుకున్న ఫొటోల‌ను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Rakul Preet Singh vacation with her boy friend Jackky Bhagnani
Rakul Preet Singh

కాగా ర‌కుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఫొటోల‌కు ప‌లువురు హీరోయిన్స్ లైక్ కొట్టారు. స‌మంత‌, రాశీ ఖ‌న్నాలు చాలా అందంగా ఉన్నావంటూ.. ర‌కుల్ ఫొటోల‌కు కామెంట్లు కూడా పెట్టారు. ఈ క్ర‌మంలోనే ర‌కుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు తెగ ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ గ‌త కొద్ది నెల‌ల కింద‌టే తాను జాకీ భ‌గ్నానితో ప్రేమ‌లో ఉన్న‌ట్లు అఫిషియ‌ల్‌గా తెలిపింది. అప్ప‌టి నుంచి వీరు ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే వెళ్తున్నారు. అత‌నితో ప్రేమ‌లో ఉండ‌డంతో వీరు త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటార‌ని అనుకున్నారు. కానీ అందుకు ఇంకా స‌మయం ఉంద‌ని రిప్లై ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌.

కాగా ర‌కుల్ ప్రీత్ సింగ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. జాన్ అబ్ర‌హాంతో క‌లిసి అటాక్ అనే సినిమాలో.. సిద్ధార్థ మ‌ల్హోత్రాతో క‌లిసి థాంక్ గాడ్ అనే మూవీలో.. ఆయుష్మాన్ ఖురానాతో క‌లిసి డాక్ట‌ర్ జి అనే మూవీలో.. ర‌న్‌వే 34 అనే మ‌రో మూవీలోనూ న‌టిస్తూ బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి