Rajnikanth : గుడ్ న్యూస్.. కోలుకున్న ర‌జ‌నీకాంత్, ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్..!

November 1, 2021 9:10 AM

Rajnikath : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రతిష్టాత్మక `దాదా సాహెబ్‌ ఫాల్కే` అవార్డుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్న విష‌యం తెలిసిందే. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్భంగా రజనీకాంత్‌ అటు ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ని కలిశారు.

Rajnikath discharged from hospital fans happy

ఢిల్లీ నుండి వ‌చ్చాక ర‌జనీకాంత్‌కి ఒంట్లో న‌ల‌తగా అనిపించ‌డంతో కావేరీ ఆసుప‌త్రిలో చేరారు. వైద్యులు ఆయ‌న్ని ప‌రిశీలించి మెద‌డులోని న‌రాల్లో ఏవో బ్లాక్స్ ఉన్నాయ‌ని గుర్తించి చికిత్స అందించారు. క‌రోటిడ్ ఆర్ట‌రీ రివాస్కుల‌రైజేష‌న్ శ‌స్త్ర చికిత్స చేయించుకోవాల‌ని వైద్యులు ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సూచించారు. ర‌జ‌నీ ఓకే చెప్ప‌డంతో వెంట‌నే శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించారు. అది విజ‌య‌వంతం కావ‌డంతో ఆసుప‌త్రిలో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న త‌లైవా ఆదివారం రాత్రి ఇంటికి వ‌చ్చారు.

నా చికిత్స పూర్తయ్యింది. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగు ప‌డాల‌ని ప్రార్థ‌న‌లు చేసిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల‌కు హృద‌య పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.. అని ర‌జ‌నీకాంత్ పేర్కొన్నారు. ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ మూవీ అన్నాత్తె (పెద్ద‌న్న‌) దీపావళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న‌ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. త‌లైవ‌ర్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment