గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Rajnikanth : రాజ‌కీయాల మాదిరిగానే ర‌జ‌నీకాంత్ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్నారా..?

Rajnikanth : వెండితెర‌పై ఓ వెలుగు వెలిగిన ర‌జ‌నీకాంత్ ఫ్యూచ‌ర్‌లో సినిమాలు చేస్తారా.. అంటే.. లేద‌నే స‌మాధానం వినిపిస్తోంది. వ‌యోభారం కారణంగా ర‌జ‌నీకాంత్ త‌ర‌చూ అనారోగ్యం బారిన ప‌డుతున్నారు. తీవ్రమైన రక్తపోటు, అలసట కారణంగా రజనీ డిసెంబరు 25,…

Rajnikanth : రాజ‌కీయాల మాదిరిగానే ర‌జ‌నీకాంత్ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్నారా..?

Rajnikanth : వెండితెర‌పై ఓ వెలుగు వెలిగిన ర‌జ‌నీకాంత్ ఫ్యూచ‌ర్‌లో సినిమాలు చేస్తారా.. అంటే.. లేద‌నే స‌మాధానం వినిపిస్తోంది. వ‌యోభారం కారణంగా ర‌జ‌నీకాంత్ త‌ర‌చూ అనారోగ్యం బారిన ప‌డుతున్నారు. తీవ్రమైన రక్తపోటు, అలసట కారణంగా రజనీ డిసెంబరు 25, 2020న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో రెండు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయి చెన్నై వెళ్లిపోయారు.

Rajnikanth may say good bye to movies

అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల‌న రజినీకాంత్ తాను రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. రాజకీయ ప్రకటనకు ముందు తాను అనారోగ్యానికి గురవడం, ఆసుపత్రిలో చేరడం.. ఇవన్నీ దేవుడి హెచ్చరికగా భావిస్తున్నాను. అందుకే రాజకీయాల్లో అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నాను అని అన్నారు. ఇప్పుడు అన్నాత్తె పూర్తి చేసి మ‌రో మూవీ చేద్దాం అనుకునేలోపు ర‌జ‌నీకాంత్ మళ్లీ అనారోగ్యానికి గుర‌య్యారు.

త‌నకు మార్కెట్ ఉంది కాబట్టి, అభిమానులు చూస్తున్నారు కాబట్టి రజనీకాంత్ సినిమాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెగ్యులర్ గా సినిమాలు చేసే పరిస్థితిలో రజనీకాంత్ లేరు. వయసు రీత్యా వచ్చిన సమస్యల వల్ల ఆయన ఎప్పటికప్పుడు అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. 70 ఏళ్ల రజనీకాంత్ అన్నాత్తై (పెద్దన్న)తో కలిపి 168 సినిమాలు పూర్తిచేశారు. ఆయన 170 సినిమాలు చేస్తే చూడాలని ఫ్యాన్స్ కు కూడా ఉంది. కానీ అది జ‌రిగేలా క‌నిపించ‌డం లేదు. అదృష్టం బాగుంటే పెరియసామి, కార్తీక్ సుబ్బరాజు లాంటి దర్శకులతో సినిమాలు చేసే అవ‌కాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి