Rajamouli : ఒకే ఒక్క సినిమాతో మన తెలుగు తెర ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి చిత్రంతో ఘన విజయాన్ని అందుకొని ప్రపంచ దృష్టిని మన టాలీవుడ్ వైపు తిప్పేశాడు. మరొకసారి ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ దర్శకుల స్టామినా ఏంటో చాటిచెప్పారు. రాజమౌళి ఏ చిత్రమైనా దర్శకత్వం వహిస్తున్నాడు అనే వార్త వినిపిస్తే చాలు.. ఆ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా.. అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు.
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈగ చిత్రం ఆడియో ఫంక్షన్ లో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. నాలో దర్శకుడే కాదు మంచి నటుడు కూడా ఉన్నాడని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఇదే విషయంపై రాజమౌళి మగధీర సినిమా టైంలో సినిమా మేకింగ్ వీడియోలతో తన కోరికను నెరవేర్చుకున్నా.. అంటూ చెప్పారు. అంతేకాదు రాజమౌళి అప్పుడప్పుడూ కొన్ని చిత్రాలలో గెస్ట్ రోల్స్ కూడా చేశారు.
ఆయనే దర్శకత్వం వహించిన బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో మద్యం వ్యాపారిగా చిన్న అతిథి పాత్ర చేయడం జరిగింది. అంతేకాకుండా రాజమౌళి ఇతరులు దర్శకత్వం వహించిన చిత్రాలలో కూడా అతిథి పాత్రలలో కనిపించారు. విరించి వర్మ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను చిత్రం చివర్లో రాజమౌళి అతిథి పాత్రలో నటించారు.
మజ్ను మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. కానీ ఆ తర్వాత వి.ఎస్ ఆదిత్య తెరకెక్కించిన రెయిన్ బో చిత్రంలో కూడా రాజమౌళి గెస్ట్ రోల్ లో నటించారు. ఈ చిత్రం అనుకున్న మేరకు విజయం సాధించలేకపోయింది. దర్శకుడిగా ఎన్నో విజయాలు అందుకున్న రాజమౌళి నటుడిగా ఒక ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…