Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యే ఆయన వెకేషన్‌కు వెళ్లి వచ్చారు. అయితే వెకేషన్ సందర్భంగా ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబును కలిసి ఆయనతో తీయబోయే సినిమా కథను ఓకే చేశారని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే వెకేషన్ నుంచి వచ్చిన తరువాత రాజమౌళి పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అందులో భాగంగానే ఆయన ఆహా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
ఆహా సంస్థ నిర్మిస్తున్న ఆన్యాస్ ట్యుటోరియల్ అనే సినిమాకు చెందిన ట్రైలర్‌ను రాజమౌళి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. తనకు దెయ్యాలు అంటే భయమని.. అందుకనే హార్రర్ సినిమాలను చూడనని ఆయన తెలిపారు. అయితే తనకు రెండు హార్రర్ సినిమాలు అంటే ఇష్టమని తెలిపారు. హాలీవుడ్‌లో వచ్చిన ది ఓమెన్, ది పారానార్మల్ యాక్టివిటీ అనే రెండు చిత్రాలు అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలను చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఆన్‌లైన్ లో ఈ మూవీల కోసం వెదుకుతున్నారు.
ఇక రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా 2023 ప్రథమార్థంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. ఇక ఆన్యాస్ ట్యుటోరియల్ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీని ఆహా సంస్థ నిర్మిస్తుండగా.. పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహిస్తోంది. రెజీనా, నివేదిత సతీష్ లు ఇందులో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు ఈ మూవీని సమర్పిస్తున్నారు. ఆహాలో ఈ మూవీ జూలై 1వ తేదీన రిలీజ్ కానుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…