Naga Chaitanya : సమంత, నాగచైతన్య ఇద్దరూ గతంలో ఎంత అన్యోన్యంగా ఉండేవారో అందరికీ తెలిసిందే. వీరు టాలీవుడ్‌లోనే మోస్ట్ క్యూట్ కపుల్‌గా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిమధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు తమ తమ సోషల్ ఖాతాల ద్వారా వెల్లడించారు. ఇక ఆ తరువాత నుంచి వీరు ఎవరి పని వారు చేసుకుంటున్నారు. సమంత సినిమాలు, ఐటమ్ సాంగ్ లు, వెకేషన్స్, కవర్ పేజీ ఫొటోషూట్స్‌తో గతంలో ఎన్నడూ లేనంతగా గ్లామర్ షో చేస్తోంది. ఇక చైతన్య కూడా లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి జోరు మీదున్నాడు. ఇక చైతూ నటించిన లాల్ సింగ్ చడ్డా అనే మూవీతోపాటు థాంక్ యూ అనే ఇంకో మూవీ కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
అయితే విడాకుల తరువాత సమంతపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి కానీ చైతన్య మీద పెద్దగా విమర్శలు రాలేదు. సమంత వల్లే చైతన్య విడాకులు ఇవ్వాల్సి వచ్చిందన్న కారణాన్ని ఫ్యాన్స్ చెబుతున్నారు. కనుకనే వారు సమంతనే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. అయితే వీరు యువ దంపతులు. వయస్సు ఇంకా మీద పడలేదు. కనుక వీరు తలచుకుంటే మళ్లీ పెళ్లి అనే ఆలోచన చేయవచ్చు. కానీ సమంతను చూస్తే ఆ ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ చైతూ మాత్రం అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన గత కొంత కాలంగా ఓ హీరోయిన్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అడివి శేష్‌తో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తెలుసు కదా. ఆమెతోనే చైతూ ప్రేమాయణం నడిపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈమె పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో అడివి శేష్ పక్కన గూఢచారి అనే మూవీతోపాటు ఈ మధ్యే విడుదలైన మేజర్ అనే మూవీలోనూ నటించింది. ఈ క్రమంలోనే ఈమెతో చైతూ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీరు ఇప్పటికే అనేక సార్లు కలుసుకున్నారని.. నాగచైతన్య ఆమెను ఇంటికి తీసుకెళ్లి ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా పరిచయం చేశాడట. ఈ క్రమంలోనే వీరు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక మేజర్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా శోభిత ఈ మధ్యే కొద్ది రోజుల పాటు హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో స్టే చేసింది. ఈ క్రమంలో చైతూ ఆమె ఉన్న హోటల్‌కు కొన్ని సార్లు వెళ్లాడట. అక్కడ అతను బాగా కనిపించాడని సమాచారం. ఇక శోభిత బర్త్ డేకు కూడా చైతన్య వెళ్లాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరు త్వరలో ఓ మూవీలో నటిస్తారని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలే. వీటిలో నిజం ఎంత ఉంది.. అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్తలపై వారు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక శోభిత గతంలో బాలీవుడ్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ప్రణవ్ మిశ్రాతో డేటింగ్ చేసిందని సమాచారం. తరువాత అడివి శేష్‌తో ప్రేమాయణం నడిపిందని టాక్ వచ్చింది. ఇప్పుడు చైతన్యతో ఆమె రిలేషన్ షిప్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజుల పాటు వేచి చూడక తప్పదు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…