IPL 2021 : దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2021 టోర్నీ 45వ మ్యాచ్‌లో పంజాబ్ గెలుపొందింది. కోల్‌కతా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగానే ఛేదించింది. ఈ క్రమంలో కోల్‌కతాపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ చేయగా కోల్‌కతా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లలో వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి మాత్రమే రాణించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. 49 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో వెంకటేష్ అయ్యర్ 67 పరుగులు చేయగా, 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో రాహుల్ త్రిపాఠి 34 పరుగులు చేశాడు. అలాగే 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో మరో బ్యాట్స్‌మన్ నితీష్ రాణా 31 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశాడు. మహమ్మద్ షమీకి 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ సులభంగానే లక్ష్యాన్ని ఛేదించింది. 19.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లలో కేఎల్ రాహుల్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేయగా, మయాంక్ అగర్వాల్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, శివమ్ మావి, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…