గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Puneeth Rajkumar : తండ్రి మాదిరిగానే నేత్ర‌దానం చేసిన పునీత్.. ఎంత గొప్ప మ‌న‌సు ఆయ‌న‌ది..!

Puneeth Rajkumar : క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్ మూడో త‌న‌యుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే పునీత్ రాజ్ కుమార్ హఠాత్తుగా గుండెపోటుకు గురవ్వడం సినీ…

Puneeth Rajkumar : తండ్రి మాదిరిగానే నేత్ర‌దానం చేసిన పునీత్.. ఎంత గొప్ప మ‌న‌సు ఆయ‌న‌ది..!

Puneeth Rajkumar : క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్ మూడో త‌న‌యుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే పునీత్ రాజ్ కుమార్ హఠాత్తుగా గుండెపోటుకు గురవ్వడం సినీ ప్రముఖులను కూడా ఎంతగానో కలచివేసింది. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర సినీ ప్రముఖులు అందరూ  పునీత్ రాజ్ కుమార్ మృతిపై తీవ్రస్థాయిలో దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

Puneeth Rajkumar donated his eyes just like his father

పునీత్ తండ్రి కూడా గుండెపోటుతో క‌న్నుమూశారు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు కూడా గుండెపోటుతో మ‌ర‌ణించ‌డంతో క‌న్న‌డిగులు శోక‌సంద్రంలో మునిగారు. సినిమాలే కాదు.. సామాజిక సేవల్లోనూ ముందున్నాడు పునీత్. ఆయన 26 అనాథ ఆశ్రమాలను నడిపిస్తున్నాడు. 16 ఓల్డేజ్ హోం లను నిర్వహిస్తున్నాడు. 1800 మంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నాడు. అంతేకాదు.. తను చనిపోవడానికంటే ముందే తన కళ్లను దానం చేసి గొప్ప మ‌నసున్న మ‌నిషి అని నిరూపించుకున్నాడు.

పునీత్ రాజ్‌కుమార్‌ను తన అభిమానులు ప్రేమగా అప్పు అనే పిలుచుకుంటారు. తాను నటించిన ‘అప్పు’ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇది తెలుగులో రవితేజ నటించిన ఇడియట్ సినిమాకు రీమేక్. దీనిని కన్నడలో డైరెక్ట్ చేసింది కూడా పూరీ జగన్నాథే. తన డెబ్యూకు ఇలాంటి కథే కరెక్ట్ అనుకున్న పునీత్.. అప్పుగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పు మ‌ర‌ణంతో క‌న్న‌డిగులు తెగ ఎమోష‌న‌ల్ అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి