Prudhvi : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. ఈ విషయం రాజకీయాలు అంటే ఓనమాలు తెలిసిన వారికి కూడా కచ్చితంగా బోధపడుతుంది. కానీ కొందరు మాత్రం ఈ విషయం తెలియక ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ వారిని బండబూతులు తిడుతుంటారు. తరువాత ఉన్న పార్టీలో పొసగక ఇంకో పార్టీకి వెళ్దామంటే.. గతంలో వాళ్లను తిట్టిన తిట్లు గుర్తుకు వస్తాయి. దీంతో ఆ పార్టీలోకి వెళ్లేందుకు అవే అడ్డంకిగా మారుతాయి. రేప్పొద్దున ఆ వీడియోలను చూపించి ఎగతాళి చేస్తారు కూడా. ఈ విషయంలో రాజకీయ నాయకులు దొరికిపోతుంటారు. కనుక ఇతర పార్టీలపై విమర్శలు చేసినా సరే బండ బూతులు అయితే తిట్టకూడదు. నోరు దగ్గర పెట్టుకుని ఉండాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. 30 ఇయర్స్ పృథ్వీకి కూడా ప్రస్తుతం ఇలాగే జరుగుతోంది.
గతంలో ఈయన సీఎం జగన్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ఆయనకు సీఎం జగన్ కీలకమైన పదవి కట్టబెట్టారు. అయితే ఓ ఫోన్ కాల్ ద్వారా పృథ్వీ జీవితం మొత్తం నాశనం అయింది. ఓ మహిళతో అతను అసభ్యంగా మాట్లాడాడని చెప్పి ఆ పదవి నుంచి తొలగించారు. అయితే తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ.. వైసీపీకి రాం రాం చెప్పేశాడు. దీంతో ఇప్పుడు వేరే పార్టీల్లో చేరాలని చూస్తున్నాడు. అయితే గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు మెగా హీరోలపై దారుణమైన కామెంట్లు చేశారు.
అప్పట్లో వైకాపా అండ చూసుకున్న 30 ఇయర్స్ పృథ్వీ మెగా హీరోలపై దారుణమైన విమర్శలు చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్‌లను నానా మాటలు అన్నారు. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీనే విమర్శిస్తున్నాడు కనుక ఆయన ఇంకో పార్టీలో చేరాలని ఆలోచిస్తున్నారు. అందుకు ఆయనకు జనసేననే ఆల్టర్‌నేటివ్ అని కనిపిస్తోంది. ఎందుకంటే అందులో ఉంటే ఓ వైపు సినిమాలతోపాటు మరోవైపు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండవచ్చు. కనుక ఆయన జనసేనలో చేరాలని చూస్తున్నారు. అయితే గతంలో మెగా హీరోలను తిట్టి ఉండడం వల్ల ఇప్పుడు పృథ్వీ పశ్చాత్తాపపడుతున్నట్లు అర్థమవుతోంది.
లేటెస్ట్‌గా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ సంచలన విషయాలను వెల్లడించారు. అందులో ఆయన వైసీపీ వల్ల ఎన్ని బాధలు పడిందీ వివరించారు. జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు. అయితే గతంలో ఆయన మెగా హీరోలను తిట్టి ఉండడం వల్ల ఇప్పుడు వారికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అందుకనే పృథ్వీ క్షమాపణలు చెప్పారు కూడా. అయితే పృథ్వీని జనసేనలోకి ఆహ్వానిస్తారా.. లేదా.. అన్నది తరువాత.. కానీ అప్పట్లో మెగా హీరోలను తిట్టినందుకు గాను పృథ్వీ ఇప్పుడు బాగానే పశ్చాత్తాప పడుతున్నట్లు తెలుస్తోంది. మరి అన్నీ మరిచిపోయి ఆయనకు మళ్లీ అవకాశం ఇస్తారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…