దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఎంతో క్లిష్టమైన పరిస్థితులలో ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఇలాంటి పరిస్థితులలో బయటకు రాకూడదని వీరు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ నిండు గర్భంతో, మండుటెండలో, లాఠీ పట్టుకొని నిలబడి తన విధులను నిర్వహిస్తున్న ఈ మహిళా అధికారికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే.
కరోనా మహమ్మారి గర్భిణీ స్త్రీలకు తొందరగా వ్యాపిస్తుందని విషయం అందరికీ తెలిసినదే.అయితే ఆ విషయాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా, ప్రజల సంక్షేమం కోసం తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు డీఎస్పీ శిల్పా సాహూ. ఈమె ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రాంతమైన దంతేవాడ డివిజన్ లో ఈ విధంగా విధులు నిర్వహిస్తూ కనిపించారు.
మండుటెండను సైతం లెక్క చేయకుండా రోడ్డులో నిలబడి ప్రజలకు కరోనా జాగ్రత్తలను సూచిస్తున్న వీడియోను పలువురు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విధుల పట్ల ఈమెకు ఉన్న బాధ్యతకు సెల్యూట్ చేస్తున్నారు. మరికొందరు గర్భంతో ఉన్న ఈమెకు ఇలాంటి పరిస్థితులలో సెలవు ఇవ్వకుండా పనులు చేయించుకోవడం తగదని పలువురు విమర్శిస్తున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…