Pragya Jaiswal : జిమ్ లో వ‌ర్క‌వుట్స్‌తో మ‌రింత హీట్ పెంచుతున్న ప్ర‌గ్యా జైస్వాల్‌.. వీడియో..!

May 20, 2022 5:40 PM

Pragya Jaiswal : కంచె సినిమా ద్వారా తెలుగులో ఎంతో మంచి గుర్తింపు పొందిన న‌టి ప్ర‌గ్యా జైస్వాల్‌. ఈ అమ్మ‌డు కెరీర్ ఆరంభంలో గ్లామ‌ర్ షో చేయ‌లేదు. కానీ అవ‌కాశాలు తగ్గ‌డంతో ఇక తాను కూడా గ్లామ‌ర్ షో మొద‌లు పెట్టేసింది. అందులో భాగంగానే రీసెంట్‌గా అఖండ మూవీలో క‌నిపించి అల‌రించింది. బాల‌కృష్ణ ప‌క్క‌న ప్ర‌గ్యా జైస్వాల్ అద్భుతంగా న‌టించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగానే ఆమె త‌ర‌చూ అందులో త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది.

అంద‌రు హీరోయిన్ల‌లాగే ప్ర‌గ్యా జైస్వాల్ కూడా ఫిట్ నెస్ ప‌ట్ల ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తుంది. ఎల్ల‌ప్పుడూ స్లిమ్ గా క‌నిపించ‌డం కోసం ఈమె జిమ్‌లో గంట‌ల త‌ర‌బ‌డి సాధ‌న చేస్తుంటుంది. ఇక ఇటీవ‌లే ఈమె జిమ్ సెష‌న్‌లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె తీసుకున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఈ అమ్మ‌డి అందాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఈమెను జిమ్ డ్రెస్‌లో చూసి అంద‌రూ షాక‌వుతున్నారు. ప్ర‌గ్యా జైస్వాల్ అందాల ప్ర‌ద‌ర్శ‌న చూసి మైమ‌రిచిపోతున్నారు.

Pragya Jaiswal inspiring her fans to do workouts
Pragya Jaiswal

ఇక ప్ర‌గ్యా జైస్వాల్ అఖండ త‌రువాత మోహ‌న్ బాబు ప‌క్క‌న స‌న్ ఆఫ్ ఇండియాలో న‌టించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఇక స‌ల్మాన్ ఖాన్ తో క‌లిసి ఆమె మై చ‌లా అనే మ్యూజిక్ వీడియోలో క‌నిపించి అల‌రించింది. అయితే ప్ర‌స్తుతం ఈమె ఎలాంటి సినిమాలు చేయ‌డం లేదు. చేతిలో సినిమాలు ఏమీ లేవు. మ‌రి ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షో ను చూసి అయినా అవ‌కాశాలు వ‌స్తాయా.. రావా.. అన్న‌ది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now