Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాలన్నీకూడా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నాయి. అయితే ప్రభాస్ చేస్తున్న రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ చిత్రాల బడ్జెట్ కలిపితే రూ.1000 కోట్ల పైమాటే. దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రకటించిన ప్రాజెక్ట్ కె బడ్జెట్ రూ. 500 కోట్లు. ఇక ఇటీవల అనౌన్స్ చేసిన ప్రభాస్ 25వ చిత్రం స్పిరిట్ కూడా భారీ బడ్జెట్‌తో రూపొందనుందని సమాచారం.
స్పిరిట్ చిత్రానికి సంబంధించి వస్తున్న వార్తలు అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో ప్రభాస్‌తో ఢీ అంటే ఢీ అనే లేడీ విలన్‌గా కరీనా కపూర్ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఆమెతో ఫైట్ సీన్లలో ప్రభాస్ నటించనున్నాడట. ఇప్పుడు ప్రభాస్ హీరోగా చేస్తోన్న ‘ఆది పురుష్’లో సైఫ్ ఆలీఖాన్.. రావణాసురుడిగా నటించాడు. కాగా ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రంలో కరీనా కపూర్ విలన్‌గా నటిస్తుందని తెలుస్తోంది.
భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో స్పిరిట్ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. అయితే ఈ భారీ చిత్రానికి ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో భారీ రెమ్యూనిరేషన్ పొందుతున్నాడని బీ టౌన్ టాక్. ‘స్పిరిట్’ సినిమాకు ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్ల భారీ పారితోషికం అందుకోనున్నాడని టాక్ వినిపిస్తోంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…