Prabhas : స‌న్న‌గా మారి ఫిట్ అయిన లుక్‌లో క‌నిపిస్తున్న ప్ర‌భాస్‌.. ఫొటో వైర‌ల్‌..!

June 15, 2022 9:49 PM

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్వ‌క‌త్వంలో స‌లార్ అనే మూవీ చేస్తున్నారు. అలాగే ఆది పురుష్ సినిమా ముగించుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో ఉన్నారు. దీంతోపాటు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్ కె అనే మూవీ చేస్తున్నాడు. అయితే బాహుబ‌లి త‌రువాత ప్ర‌భాస్ న‌టించిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు రెండూ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ ప‌రిచాయి. దీంతో ఈసారి రిలీజ్ అయ్యే మూవీతో ఎలాగైనా స‌రే హిట్ కొట్టాల‌నే త‌ప‌న‌తో ప్ర‌భాస్ సినిమాలు చేస్తున్నాడు.

ఇక ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌భాస్ చాలా వ‌ర్క‌వుట్లు చేసిన‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే ఆయ‌న తాజాగా స్లిమ్‌గా.. వెనుక‌టి బాహుబ‌లి లుక్‌లో క‌నిపించాడు. నిజానికి బాహుబ‌లి మూవీ త‌రువాత ప్ర‌భాస్ బాగా బ‌రువు పెరుగుతూ వ‌చ్చాడు. రాధేశ్యామ్ అనంత‌రం ఇంకా ఎక్కువ లావుగా క‌నిపించాడు. దీంతో ఆయ‌న‌ను ట్రోల్ చేశారు. అయితే త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లో.. మ‌రో కార‌ణ‌మో తెలియ‌దు కానీ.. ప్ర‌భాస్ తాజాగా మ‌ళ్లీ ఫిట్ అయిన లుక్‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న లేటెస్ట్ ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Prabhas became very slim and fit photo viral
Prabhas

అయితే ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న స‌లార్ కోస‌మే ప్ర‌భాస్ ఇలా మ‌ళ్లీ ఫిట్ బాడీలోకి మారాడ‌ని అంటున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు పూర్తి చేయ‌నున్నారు. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ మూవీ రిలీజ్ కానుంద‌ని స‌మాచారం. అయితే మ‌రో ఏడాదిలో ప్ర‌భాస్ పెళ్లి కూడా అవుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కృష్ణం రాజు ఇప్ప‌టికే ప్ర‌భాస్‌కు మంచి సంబంధం చూశార‌ని అంటున్నారు. మ‌రి ప్ర‌భాస్ ఇంత బిజీ షెడ్యూల్‌లో పెళ్లి చేసుకుంటారా.. లేదా.. అన్న‌ది.. వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment