Pop Corn : సాధారణంగా మనం సినిమాలకు వెళ్లినప్పుడు ఇంటర్‌వెల్ సమయంలో పాప్ కార్న్ కొని తింటుంటాం. అలాగే ప్రయాణాలు చేసే సమయంలో లేదా ఇంట్లో ఏ ఇతర స్నాక్స్ తినబుద్ది కానప్పుడు ఒక్కోసారి పాప్ కార్న్‌ను ఇంట్లోనే తయారు చేసి తింటుంటాం. ఇక ఇందులో అనేక రకాల ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. బయట మనకు వివిధ రకాల ఫ్లేవర్స్‌లో పాప్ కార్న్‌ను అందిస్తుంటారు. అయితే పాప్ కార్న్‌ను తినడంలో చాలా మందికి సందేహం ఉంటుంది. అసలు పాప్ కార్న్‌ను తినవచ్చా.. అది మంచిదేనా.. తింటే ఏం జరుగుతుంది.. వంటి డౌట్స్ వస్తుంటాయి. ఇక దీనికి నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పాప్ కార్న్‌ను తినవచ్చు. మంచిదే. దీంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పాప్ కార్న్ ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది. కనుక మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పోషకాలు లభిస్తాయి. పాప్ కార్న్ చాలా సులభంగా జీర్ణమవుతుంది. కనుక చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే నిరభ్యంతరంగా పాప్ కార్న్‌ను తినవచ్చు. ఇక పాప్ కార్న్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్లు, మాంగనీస్, మెగ్నిషియం తదితర పోషకాలు ఉంటాయి. కనుక మనం ఆరోగ్యంగా ఉంటాము. ఎలాంటి రోగాలు రావు.
పాప్ కార్న్ ను తినడం వల్ల కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు పోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పాప్ కార్న్ లో ఉండే ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారికి పాప్ కార్న్ ఎంతగానో మేలు చేస్తుంది. పాప్ కార్న్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. దీని వల్ల అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు. మలబద్దకం తగ్గుతుంది. రోజూ సాఫీగా విరేచనం అవుతుంది. అలాగే పేగుల్లో కదలికలు బాగుంటాయి. షుగర్ ఉన్నవారికి పాప్ కార్న్ మేలు చేస్తుంది. షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతుంది. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే ఎముకలు బలంగా మారుతాయి. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది.
ఇక పాప్ కార్న్ మంచిదే అయినప్పటికీ దీన్ని బయట తినరాదు. ఇంట్లోనే చేసుకుని తినడం శ్రేయస్కరం. ఎందుకంటే బయట లభించే పాప్ కార్న్‌లో చక్కెర, ఇతర తీపి పదార్థాలు, ఫ్లేవర్స్‌ను కలుపుతారు. అలా కలపకుండా తినాలి. అవి కలిపితే పాప్ కార్న్‌ను తిన్నా మనకు ఎలాంటి లాభం ఉండదు. కనుక ఎలాంటి ఫ్లేవర్స్ కలపకుండా సహజసిద్ధంగా పాప్ కార్న్‌ను తయారు చేసుకుని తినాలి. దీంతోనే మనం ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి పాప్ కార్న్‌ను తినే ముందు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేదంటే పాప్ కార్న్‌ను తిని కూడా ప్రయోజనం ఉండదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…