Ponniyin Selvan 1 : పొన్నియిన్‌ సెల్వన్‌ 1 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Ponniyin Selvan 1 : ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం.. పొన్నియిన్‌ సెల్వన్‌ 1. ఇందులో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు నటించారు. అలాగే బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్ కూడా ఓ ముఖ్యపాత్రను పోషించింది. అయితే ఎన్నో అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియిన్‌ సెల్వన్‌ 1 మూవీ ఎలా ఉంది.. ప్రేక్షకుల అంచనాలను మించి ఉందా.. సినిమా కథ ఏమిటి.. అలిరిస్తుందా.. లేదా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కథ..

అదిత కరికాలన్‌ (విక్రమ్‌) చోళ రాజ్యానికి రాజు. అతని ఆదేశాల మేరకు వల్లవరాయ (కార్తి) రాజ్యంలో మారువేషంలో తిరుగుతూ రాజ్యాన్ని ఎవరు దక్కించుకోవాలని కుట్ర పన్నుతున్నారు.. వంటి విషయాలను సేకరిస్తుంటాడు. అయితే చివరకు ఏమవుతుంది ? తన రాజ్యాన్ని కరికాలన్‌ ఎలా రక్షించుకున్నాడు..? దీనికి ప్రత్యర్థులు వేసిన ఎత్తులు ఏమిటి.. వాటిని కరికాలన్‌ ఎలా చిత్తు చేశాడు.. వంటి వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

Ponniyin Selvan 1

విశ్లేషణ..

బాహుబలి స్ఫూర్తితో మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో అగ్రశ్రేణి నటీనటులు ఉండడంతో యాక్టింగ్‌కు కొదువ లేదు. కార్తి, విక్రమ్‌, జయం రవి, పార్థిబన్‌, త్రిష, ఐశ్వర్యారాయ్‌, ప్రకాష్‌ రాజ్‌ వంటి నటీనటులు తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు. ఇక ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌, అక్కడక్కడా వచ్చే యాక్షన్‌ సీన్లు అలరిస్తాయి. అయితే సినిమాలో తమిళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ మూవీ అందరు ప్రేక్షకులకు నచ్చదు.

మూవీలో చాలా వరకు పేర్లు తమిళ భాషకు చెందినవి ఉంటాయి. అందువల్ల సినిమా చూసిన ప్రేక్షకులకు సినిమా అనంతరం ఆ పేర్లు గుర్తుండవు. అలాగే అన్ని క్యారెక్టర్లు ఉన్నప్పటికీ వారి పేర్లు, వారి సన్నివేశాలు సినిమా చూశాక ప్రేక్షకులకు గుర్తుండవు. తమిళ ప్రేక్షకులకు అయితేనే మూవీ బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది వారి నేటివిటీకి చెందినది కనుక. బాహుబలి ఒక కల్పిత కథ. దీన్ని యూనివర్సల్‌ గా తెరకెక్కించారు. అందువల్ల అది అందరికీ నచ్చింది. కానీ పొన్నియిన్‌ సెల్వన్‌ 1 తమిళ ప్రాంతానికి చెందినది. కనుక ఆ ప్రభావం అందులో ఎక్కువగా కనిపిస్తుంది. వారి కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలు అన్నీ తమిళ ప్రాంతానికి చెందినవిగా ఉంటాయి. కనుక తమిళ వాసన అందరికీ నచ్చకపోవచ్చు.

అయితే ఓవరాల్‌గా చూస్తే పొన్నియిన్‌ సెల్వన్‌ గొప్ప అనుభూతిని ఇస్తుంది. అయినప్పటికీ తమిళ నేటివిటీ అధికంగా ఉండడం వల్ల ఇతర ప్రాంతాల ప్రేక్షకులు దాన్ని ఎలా స్వీకరిస్తారు.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే సినిమా మాత్రం ఆద్యంతం బోరింగ్‌గా సాగుతుంది. కనుక ఓపిక ఉంది.. కొత్తదనం కావాలి.. అనుకున్నవారు ఈ మూవీకి వెళ్లవచ్చు. లేదంటే చూడకపోవడమే మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM