Pokiri Movie Hit : పోకిరి సినిమా హిట్ ఎందుకు అయింది ? అంత‌గా అందులో ఏముంది ?

Pokiri Movie Hit : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ప్రిన్స్‌గా సినిమా కెరీర్‌ను మొద‌లుపెట్టి త‌న తండ్రిలాగే సూప‌ర్ స్టార్ అయ్యారు. మ‌హేష్ బాబు న‌ట‌న‌లోనూ తండ్రికి త‌గిన త‌న‌యుడు అనిపించుకున్నారు. క‌నుక‌నే ఆయ‌న సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఇక మ‌హేష్‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పోకిరి సినిమాను అయితే ప్రేక్ష‌కులు ఇప్ప‌టికీ ఎంతో ఆస‌క్తిగా చూస్తుంటారు. ఈ మూవీ అంత‌లా హిట్ అయింది. 2006లో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో వ‌చ్చిన ఈ మూవీలో మ‌హేష్‌కు జోడీగా ఇలియానా న‌టించింది. అప్ప‌టికే దేవ‌దాసు సినిమాతో హిట్ కొట్టిన ఈ భామ పోకిరితో రెండో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. దీంతో ఈమె వెనుదిరిగి చూడ‌లేదు.

అటు మ‌హేష్‌తోపాటు ఇటు ఇలియానా, పూరీ జ‌గ‌న్నాథ్‌ల‌కు కూడా ఈ మూవీ మ‌రో లైఫ్‌ను ఇచ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఫ్లాప్‌ల‌తో ఉన్న హీరో, ద‌ర్శ‌కుడికి ఈ మూవీ మంచి బ్రేక్ ను ఇచ్చింది. అయితే పోకిరి సినిమాను చివ‌రి వ‌ర‌కు చూస్తే గానీ అస‌లు ఏమీ అర్థం కాదు. అస‌లు అందులో క‌థ ఏముంది ? అన్న అభిప్రాయం స‌గ‌టు ప్రేక్ష‌కుడికి క‌లుగుతుంది. అయితే పోకిరి సినిమా అంత‌టి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ‌డం వెనుక ఉన్న కార‌ణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Pokiri Movie Hit

పూరీ జ‌గ‌న్నాథ్‌కు మాస్ ఆడియ‌న్స్ ప‌ల్స్ బాగా తెలుసు. అందుక‌నే ఆయ‌న డైలాగ్స్ ఆ విధంగా రాసుకుంటారు. ఈ క్ర‌మంలోనే హీరోను ఆ డైలాగ్‌లే ఎలివేట్ చేస్తాయి. స‌రిగ్గా పూరీ కూడా ఇదే సూత్రాన్ని పోకిరిలో పాటించాడు. ముఖ్యంగా ఎవ‌డు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండు గాడు.. అని చెప్పే డైలాగ్ అదుర్స్‌. దీనికి థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల నుంచి వ‌చ్చిన రెస్పాన్స్ అదుర్స్‌. ఇక ఇలాంటి సీన్లు ఈ మూవీలో చాలానే ఉంటాయి. ఫ‌లానా సీన్ లో అలా జ‌రుగుతుంది కాబోలు అని ప్రేక్ష‌కులు ఊహించేలోపే వారికి షాక్ ఇచ్చేలా సీన్ మారుతుంది. వారు అనుకున్న విధంగా సీన్ ఉండ‌దు. ఇది ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఇలాంటి సీన్స్ పోకిరిలో చాలానే ఉన్నాయి. క‌నుక‌నే ప్రేక్ష‌కుల‌కు ఈ మూవీ థ్రిల్‌ను అందించింది. హిట్ అయింది.

ఇక పోకిరి సినిమాలో సీన్లు అన్నీ చాలా వేగంగా ముందుకు సాగుతుంటాయి. ఎక్క‌డా బోర్ ఫీలింగ్ రాదు. త‌రువాత ఏం జ‌రుగుతుందో అనే టెన్ష‌న్‌ను క్రియేట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. అలాగే ఆలీ, బ్ర‌హ్మానందంల కామెడీ ట్రాక్ ఓ వైపు సాగుతుంటుంది. దీంతో ప్రేక్ష‌కులు మ‌ధ్య మ‌ధ్య‌లో రిలీఫ్ ఫీల‌వుతారు. ఇంకో వైపు హీరో యాక్ష‌న్ సీన్లు.. చివ‌ర‌కు హీరో రౌడీ కాదు.. పోలీస్‌.. అండ‌ర్‌క‌వ‌ర్ కాప్‌.. అని రివీల్ చేస్తారు. ఇది ప్రేక్ష‌కుల‌కు ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్‌. ఇలా ఎన్నో అంశాలు పోకిరిలో ఉన్నాయి. క‌నుక‌నే ఈ మూవీ హిట్ అయింది.

అయితే ఇలాంటి సినిమాల‌ను ఒక‌సారి తీస్తేనే ప్రేక్ష‌కులు చూస్తారు. ఈ విధమైన క‌థ‌తో ఇంకా సినిమాలు తీస్తే న‌డ‌వ‌వు. ఎందుకంటే అప్ప‌టికే ఈ త‌ర‌హా సినిమా చూసి ఉంటారు క‌నుక నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో ప్రేక్ష‌కులు ఈజీగా చెప్పేస్తారు. క‌నుక ద‌ర్శ‌కుడు స‌క్సెస్ కోసం ఏ ఫార్ములాను వాడినా.. అది ఆ సినిమాకే. త‌రువాతి సినిమాకు ఇంకో కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు రావ‌ల్సిందే. లేదంటే.. పాత ధోర‌ణిలోనే సినిమా తీస్తే ప్రేక్ష‌కులకు క‌చ్చితంగా బోర్ కొడుతుంది. అప్పుడు సినిమా చూడాల‌న్న ఆస‌క్తి ఉండ‌దు. దీంతో మూవీ నిరాశ ప‌రిచి ఫ్లాప్ అవుతుంది. కనుక ఎప్ప‌టిక‌ప్పుడు భిన్న కాన్సెప్ట్‌తో సినిమాల‌ను తీసేలా ద‌ర్శ‌కులు ప్లాన్ చేసుకోవాలి. అది పోకిరికి వ‌ర్క‌వుట్ అయింద‌ని చెప్ప‌వ‌చ్చు. క‌నుక‌నే ఆ మూవీ హిట్ అయింది. ప్రేక్ష‌కులు మెచ్చారు. కానీ త‌రువాత పూరీ అలాంటి సినిమాలు తీయ‌లేక‌పోయారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM