Points Table IPL 2021 : ముంబై ప‌ని క్లోజ్ అయిన‌ట్లే.. ఆరెంజ్, ప‌ర్పుల్ క్యాప్ ప్లేయ‌ర్ల వివ‌రాలు..

Points Table IPL 2021 : ప్ర‌తి సీజ‌న్‌లోనూ డిఫెండింగ్ చాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగుతున్న ముంబై ఇండియ‌న్స్‌కు ఈ సీజ‌న్‌లో గ‌డ్డు ప‌రిస్థితి వ‌చ్చింది. ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవ‌కాశాల‌ను ముంబై ఇంకా సంక్లిష్టం చేసుకుంది. అయితే ఇందులో ముంబై ప్ర‌మేయం ఏమీ లేదు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఎప్పుడైతే రాజ‌స్థాన్‌పై 86 ప‌రుగుల భారీ తేడాతో గెలిచిందో.. అప్పుడే ముంబై ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు పూర్తిగా త‌గ్గిపోయాయి. ఈ క్ర‌మంలోనే ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్‌క‌తా జ‌ట్టు ఐపీఎల్ 2021 పాయింట్ల ప‌ట్టిక‌లో +0.587 నెట్ ర‌న్ రేట్‌తో నాలుగో స్థానంలో నిలిచింది.

అయితే కోల్‌క‌తా అంత‌టి భారీ విజ‌యం సాధించ‌డంతో ముంబై ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు చాలా స‌న్న‌గిల్లిపోయాయి. ఈ క్ర‌మంలోనే ఇంకో మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ సేన ముందుగా బౌలింగ్ చేసి ప్ర‌త్య‌ర్థి జట్టుపై 171 ప‌రుగుల తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా అసాధ్య‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఏదైనా మిరాకిల్ జ‌రిగితే త‌ప్ప ముంబై ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవ‌కాశాలు పూర్తిగా క్లోజ్ అయ్యాయ‌నే చెప్ప‌వ‌చ్చు.

Points Table IPL 2021 : ఢిల్లీ టాప్ ప్లేస్‌లో..

ఇక ప్ర‌స్తుతం ఐపీఎల్ 2021 పాయింట్ల ప‌ట్టిక‌లో 20 పాయింట్ల‌తో ఆడిన 13 మ్యాచ్‌ల‌లో 10 గెలిచి ఢిల్లీ టాప్ ప్లేస్‌లో ఉంది. త‌రువాత 9 విజ‌యాల‌తో 18 పాయింట్ల‌తో చెన్నై రెండో స్థానంలో ఉంది. 8 విజ‌యాలు, 16 పాయింట్ల‌తో బెంగ‌ళూరు మూడో స్థానంలో ఉండ‌గా.. 7 విజ‌యాలు, 14 పాయింట్ల‌తో కోల్‌క‌తా 4వ స్థానంలో ఉంది. అలాగే పంజాబ్‌, ముంబై, రాజ‌స్థాన్‌, హైద‌రాబాద్‌లు వ‌రుస స్థానాల్లో నిలిచాయి.

ఇక ఆరెంజ్ క్యాప్ నిన్న మొన్న‌టి వ‌ర‌కు డుప్లెసిస్ వ‌ద్ద ఉండ‌గా.. కేఎల్ రాహుల్ అద్భుత‌మై 98 ప‌రుగుల‌తో ఆ క్యాప్‌ను తాను సొంతం చేసుకున్నాడు. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో 13 మ్యాచ్‌ల‌లో 29 వికెట్లు తీసిన ఆర్‌సీబీ పేస‌ర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ ప‌ర్పుల్ క్యాప్‌ను త‌న ద‌గ్గ‌రే ఉంచుకున్నాడు. ఈ క్ర‌మంలో ప్లే ఆఫ్స్ స‌మీపిస్తుండ‌గా.. ఏ జట్టు ఫైన‌ల్ కు చేరి ట్రోఫీని లిఫ్ట్ చేస్తుందా.. అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM