Plastic Surgery : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు టాలెంట్ తో పాటు ఆకట్టుకునే అందం కూడా ఉండాలి. ఆ అందం కోసం ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ఇలా చేయించుకునే హీరోయిన్లపై బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే సంచలన కామెంట్స్ చేసింది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్లు తమ నో ఫిల్టర్ లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాము మేకప్ వేసుకోలేదని టెక్నాలజీని వినియోగించి అందానికి మెరుగులు దిద్దలేదని కొంతమంది హీరోయిన్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోలు పెట్టడంలో గొప్ప ఏంటని రాధికా ఆప్టే ప్రశ్నిస్తున్నారు. నో ఫిల్టర్ ఫోటోలను షేర్ చేయడం బదులు ప్లాస్టిక్ సర్జరీలను ఆపాలని అన్నారు.
ఆ సర్జరీల వల్ల అందం పెరగడం ఏమో గానీ ఉన్న అందాన్ని చెడగొడుతున్నారని కామెంట్ చేశారు. సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి, శృతిహాసన్, సమంతలతో పాటు మరికొంతమంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకున్నారని, ఆ విషయాలు చెప్పుకోవడానికి ఇష్టపడరని.. ఇలా చేయించుకోవడం వల్ల కొంతమంది హీరోయిన్ల అందం పెరిగితే మరికొంతమంది అందం పాడైపోతుందని అన్నారు. ప్రతిఒక్కరికీ సహజంగా వచ్చిన అందమే నిజమైన అందం అని.. ప్లాస్టిక్ సర్జరీల వల్ల వచ్చిన అందం.. నిజమైన అందం కాదని.. అంటూ రాధిక ఆప్టే వ్యాఖ్యలు చేశారు. లెజెండ్ సినిమాలో హీరోయిన్ గా రాధికాకు మంచి గుర్తింపు వచ్చింది.
బాలీవుడ్ లో కూడా సినిమా ఆఫర్లు తగ్గాయి. వెబ్ సిరీస్ లో నటిస్తూ క్రేజ్ ని సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక ఎంతోమంది హీరోయిన్లు తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు ఎంతో ఖర్చు చేసి మరీ సర్జరీలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ పై ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…