Plastic Surgery : ప్లాస్టిక్ సర్జరీల వల్ల వచ్చే అందం కూడా ఒక అందమేనా..?

October 21, 2021 6:28 PM

Plastic Surgery : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు టాలెంట్ తో పాటు ఆకట్టుకునే అందం కూడా ఉండాలి. ఆ అందం కోసం ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ఇలా చేయించుకునే హీరోయిన్లపై బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే సంచలన కామెంట్స్ చేసింది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్లు తమ నో ఫిల్టర్ లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాము మేకప్ వేసుకోలేదని టెక్నాలజీని వినియోగించి అందానికి మెరుగులు దిద్దలేదని కొంతమంది హీరోయిన్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోలు పెట్టడంలో గొప్ప ఏంటని రాధికా ఆప్టే ప్రశ్నిస్తున్నారు. నో ఫిల్టర్ ఫోటోలను షేర్ చేయడం బదులు ప్లాస్టిక్ సర్జరీలను ఆపాలని అన్నారు.

Plastic Surgery beauty is not real beauty says radhika apte

ఆ సర్జరీల వల్ల అందం పెరగడం ఏమో గానీ ఉన్న అందాన్ని చెడగొడుతున్నారని కామెంట్ చేశారు. సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి, శృతిహాసన్, సమంతలతో పాటు మరికొంతమంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకున్నారని, ఆ విషయాలు చెప్పుకోవడానికి ఇష్టపడరని.. ఇలా చేయించుకోవడం వల్ల కొంతమంది హీరోయిన్ల అందం పెరిగితే మరికొంతమంది అందం పాడైపోతుందని అన్నారు. ప్రతిఒక్కరికీ సహజంగా వచ్చిన అందమే నిజమైన అందం అని.. ప్లాస్టిక్‌ సర్జరీల వల్ల వచ్చిన అందం.. నిజమైన అందం కాదని.. అంటూ రాధిక ఆప్టే వ్యాఖ్యలు చేశారు. లెజెండ్ సినిమాలో హీరోయిన్ గా రాధికాకు మంచి గుర్తింపు వచ్చింది.

బాలీవుడ్ లో కూడా సినిమా ఆఫర్లు తగ్గాయి. వెబ్ సిరీస్ లో నటిస్తూ క్రేజ్ ని సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక ఎంతోమంది హీరోయిన్లు తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు ఎంతో ఖర్చు చేసి మరీ సర్జరీలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ పై ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment