Nokia C30 : హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా సి30 పేరిట మరో కొత్త నోకియా ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.82 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్ ఉంది. 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదలైంది.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్‌లను, ఒక మెమొరీ కార్డును ఈ ఫోన్లో వేసుకోవచ్చు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయగా.. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంది.
ఈ ఫోన్లో డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇతర ఫీచర్లను కూడా అందిస్తున్నారు.
నోకియా సి30 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999గా ఉంది. జియో వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలుపై 10 శాతం మేర డిస్కౌంట్ పొందవచ్చు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…