Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల భీమ్లా నాయక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఇక పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్‌లో ఉన్నారు. మరోవైపు ఏపీలో పలు వర్గాలకు చెందిన ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. కొంత కాలం తరువాత పవన్ పూర్తిగా తన సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తారని అంటున్నారు. దీంతో నిర్మాతల్లో భయం పట్టుకుంది.
ఇప్పటికే హరిహరవీరమల్లు పూర్తి కావల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కోవిడ్ కారణంగా ఈ మూవీని ఏకంగా 2 ఏళ్ల పాటు వాయిదా వేశారు. దీంతో రీసెంట్ గా మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది. అయితే దర్శకుడు క్రిష్‌కు, పవన్‌కు మధ్య విభేదాలు వచ్చాయని, పవన్ చెప్పినట్లు దర్శకుడు క్రిష్ ఇందులో మార్పులు చేయలేదని.. కనుక ఆ మార్పులు చేసే వరకు హరిహరవీరమల్లు షూటింగ్‌కు రాలేనని.. పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక పవన్ చేయాల్సిన సినిమాల జాబితాలో.. భవదీయుడు భగత్ సింగ్, వినోదయ సీతమ్, సురేందర్ రెడ్డి సినిమా ఉన్నాయి. అయితే హరిహర వీరమల్లుకే దిక్కులేదు. ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మిగిలిన సినిమాల పరిస్థితి ఏమవుతుందోనని నిర్మాతలు టెన్షన్ పడుతున్నారట. ఎందుకంటే పవన్ ఒక్క సినిమా పూర్తయ్యే సరికే చాలా కాలం పడుతుంది. అప్పటి వరకు ఎన్నికలు వస్తాయి. కానీ కొన్ని రోజుల్లోనే పవన్ ఏపీ అంతటా పాదయాత్ర చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే నిజమైతే ఆయనకు సినిమాల్లో నటించేందుకు సమయం లభించదు. దీంతో అడ్వాన్స్ ఇచ్చి వేచి చూస్తున్న నిర్మాతలకు నష్టమే కలుగుతుంది. అయితే ఈ విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పవన్ అడ్వాన్స్ తీసుకున్న సినిమాలన్నీ చకచకా పూర్తి చేసి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి కావల్సినన్ని రోజులు రాజకీయాల్లో ఉంటే బాగుంటుందని.. 2024 ఎన్నికల తరువాత వీలును బట్టి ఉంటే రాజకీయాలు లేదా మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు పూర్తి చేయాల్సిన సినిమాలను అలాగే పెండింగ్‌లో పెడితే మాత్రం నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ పడుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ విషయంలో పవన్ ఏం చేస్తారో చూడాలి. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…