Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన అప్ డేట్స్ ను అందులో షేర్ చేస్తుంటుంది. అందులో భాగంగానే సితార ఎక్కువగా డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. అంతేకాదు.. ఆమె చక్కగా యాక్ట్ చేస్తుంది కూడా. అలాగే సింగింగ్, పెయింటింగ్ వంటి కళల్లోనూ ఆమెకు ప్రవేశం ఉంది. దీంతో సితార ప్రతిభ ఏంటో ఇప్పటికే నిరూపించుకుంది. ఆమె వీడియోలను చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతుంటారు.
ఇక సితార ఈ మధ్యే తన తండ్రి సినిమా సర్కారు వారి పాటలో పెన్నీ సాంగ్‌లో కనిపించి అలరించింది. అలాగే శ్రీరామనవమి సందర్భంగా సంప్రదాయ దుస్తులను ధరించి కూచిపూడి నృత్యం చేసింది. దీంతో ఆమె డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. అయితే సితారలో కేవలం ఈ కళలే కాదు.. ఇంకా ఆమెకు గుర్రపు స్వారీ కూడా తెలుసు. తన తాత కృష్ణ, తండ్రి మహేష్‌లకు గుర్రపు స్వారీ వచ్చు. ఇక సితార కూడా హార్స్ రైడింగ్ నేర్చుకుంది. దీంతో తాజాగా ఆమె హార్స్ రైడింగ్ చేస్తున్న వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అయితే సితార ఇప్పటి వరకు ఒక్క మూవీలో కూడా నటించలేదు. కానీ ఈమె త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. మహేష్ త్వరలో త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు. ఇందులో ఈయనకు జోడీగా పూజా హెగ్డె నటించనుంది. అలాగే వచ్చే ఏడాది రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించనున్నారు. అయితే ఈ మూవీలో సితారకు చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. దీనిపై కొంత కాలం ఆగితే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…