Samantha : టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ గా పేరుగాంచిన సమంత ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె ప్రస్తుతం విజయ్ దేవర కొండతో కలిసి ఖుషి అనే మూవీలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను ఇటీవలే కాశ్మీర్ లో పూర్తి చేశారు. దీంతోపాటు యశోద అనే సినిమాలోనూ సమంత నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తి కాగా ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే సమంత నటించిన శాకుంతలం సినిమా గురించే ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు.
శాకుంతలం సినిమా పౌరాణిక గాథ ఆధారంగా తెరకెక్కింది. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సమంత ఈ మూవీకి గాను షూటింగ్, డబ్బింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. కానీ సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. మొన్నా మధ్య సమంత బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అయితే అది అంతా నాసిరకంగా ఉందని కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ అసలు బాగాలేవని చాలా మంది పెదవి విరిచారు. అయితే ఆ తరువాత శాకుంతలం సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో అసలు ఈ సినిమాకు ఏమైంది.. అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం శాకుంతలం సినిమాకు గాను గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. కానీ ఈ సినిమాలో సమంత లుక్ బాగా లేదని సహ నిర్మాత దిల్ రాజు అసంతృప్తిని వ్యక్తం చేశారట. అలాగే గ్రాఫిక్స్ కూడా అంత బాగా రాలేదని అంటున్నారు. ఇదే విషయంపై సమంత కూడా అసంతృప్తిగానే ఉందట. దీంతో ఈ సినిమా అసలు విడుదలవుతుందా.. కాదా.. అయితే ఎప్పుడు అవుతుంది.. అన్న వివరాలేవీ తెలియడం లేదు. అయితే సినిమాను మళ్లీ తీయడం కుదరదు. కనుక ఎలా వచ్చినా సరే దాన్ని విడుదల చేయాల్సిందే. అదే జరిగితే సమంత నిండా మోసపోయినట్లేనని అంటున్నారు. ఎందుకంటే నాసిరకంగా సినిమాను రిలీజ్ చేస్తే ముందుగా సమంతనే అంటారు. ఇది ఆమెకు బాగా మైనస్ అవుతుంది. దీని ప్రభావం ఆమె తదుపరి సినిమాలపై పడుతుంది. కాబట్టి శాకుంతలం విషయంలో ఆమెకు బాగానే నష్టం జరగనుందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై మేకర్స్ ఏమైనా స్పందిస్తారో.. లేదో.. చూడాలి.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…